Abn logo
Oct 17 2020 @ 23:07PM

హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్.. కుండపోత వర్షంతో తీవ్ర ఇక్కట్లు

Kaakateeya

హైదరాబాద్‌: భారీ వర్షంతో నగరంలోని ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గంటల తరబడి ట్రాఫిక్‌లో వాహనదారుల తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కంట్రోల్ రూమ్‌కి ఫిర్యాదుల వెల్లువెత్తాయి.


దిల్‌సుఖ్‌నగర్‌, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిలింనగర్‌, ఎల్బీనగర్‌, మీర్‌పేట్‌, హయత్‌నగర్‌, సైదాబాద్‌, చంపాపేట్‌, మలక్‌పేట్‌, ఎల్‌బీ నగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో కుండపోత వర్షం కురిసింది. దీంతో జీహెచ్‌ఎంసీ స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి.


దీంతో టోలిచౌకిలో నదీమ్ కాలనీ, చాబ్రా ఎంక్లేవ్, విరాసత్ కాలనీ, నాంపల్లిలోని మంగర్ బస్తీ నీట మునిగాయి. చాంద్రాయణగుట్ట జుబైల్ కాలనీ, కమలనగర్, సరూర్ నగర్‌ పీ అండ్‌ టీ కాలనీ, బేగంపేట్ ప్రకాష్‌నగర్, బ్రహ్మన్‌వాడి, చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాలు జలమయమయ్యాయి. కృష్ణానగర్‌, ఇందిరానగర్‌, వెంకటగిరిలో భారీగా వరద ప్రవాహం పారుతోంది, సికింద్రాబాద్‌ అంబేద్కర్‌ బస్తీలోని ఇళ్లలో మోకాళ్ల లోతు వరద నీరు చేరింది. వాహనాలు నీటమునిగిపోయాయి. 


అటు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగారం- మజీద్‌పూర్ వంతెన వద్ద వరదల్లో కారు చికుక్కుంది. కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. 


ఘట్‌కేసర్‌లో అత్యధికంగా 12.7 సెం.మీ, ఉప్పల్‌ 11.3 సెం.మీ, మేడిపల్లి 9.4 సెం.మీ, హయత్‌నగర్ 10.3 సెం.మీ, అబ్దుల్లాపూర్‌మెట్ 10.1 సెం.మీ మొయినాబాద్ 9.6, సరూర్‌నగర్ 9.3 సెం.మీ, సిద్దిపేట, నల్గొండ జిల్లాల్లో 8 సెం.మీ వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. 


మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో పోలీస్‌శాఖను డీజీపీ మహేందర్ రెడ్డి అప్రమత్తం చేశారు. ప్రాణనష్టం జరగకుండా చూడాలని పోలీస్ అధికారులకు డీజీపీ ఆదేశించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పరిస్థితిని సమీక్షించారు. జీహెచ్‌ఎంసీ, వివిధ శాఖల సమన్వయంతో పని చేయాలని పోలీసులను కోరారు. రానున్న రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని, వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నoదున అప్రమత్తతో ఉండాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. 


ఫలక్‌నుమాలో తప్పిన పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో రైల్వే వంతెనపై పెద్ద గొయ్యి ఏర్పడింది. రైలు పట్టాలపైకి వరద నీరు చేరింది. దీంతో రాకపోకలను నిలిపివేశారు. 
Advertisement
Advertisement
Advertisement