భారీ వర్షం

ABN , First Publish Date - 2022-07-02T06:32:09+05:30 IST

వాతావరణంలో మార్పుల కారణంగా ఎలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.

భారీ వర్షం
జలమయమైన ఎలమంచిలి-కోర్టుపేట రోడ్డు

మూడు మండలాల్లో కుండపోత


ఎలమంచిలి/నక్కపల్లి/ఎస్‌.రాయవరం, జూలై 1 : వాతావరణంలో మార్పుల కారణంగా ఎలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.  ఎలమంచిలి సుమారు గంటపాటు కుండపోతగా పడడంతో లోతట్టు ప్రాంతాలతో పాటు రోడ్లు జలమయమయ్యాయి. వర్షంపు నీటితో కలిసి మురుగు ప్రవహించడంతో పలుచోట్ల పట్టణవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే, నక్కపల్లి మండలంలో సాయంత్ర ఆరు గంటల నుంచి అరగంట పాటు వర్షం కురవడంతో అంతటా చల్లబడింది. అదేవిధంగా, ఎస్‌.రాయవరం మండలంలోని భారీ వర్షం పడింది. దీంతో పలుచోట్ల రహదారులపై పడిన గోతుల్లో ఈ నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వర్షం వ్యవసాయ పనులకు అనుకూలమని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2022-07-02T06:32:09+05:30 IST