జోరు వాన

ABN , First Publish Date - 2022-08-09T05:25:41+05:30 IST

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు మూడు రోజుల నుంచి జోరు వాన కురుస్తోంది. వానకు చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు నిండి పొంగి పొర్లుతుండగా, పొలాలు నీరుసిచ్చుపట్టి దెబ్బతింటున్నాయి.

జోరు వాన
నారాయణపేట శివారులోని సింగారం వద్ద వరి నాట్లు వేస్తున్న కూలీలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, మహబూబ్‌నగర్‌లలో నీట మునిగిన పంటలు

జలకళను సంతరించుకున్న చెరువులు, చెక్‌డ్యామ్‌లు 


  ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు మూడు రోజుల నుంచి జోరు వాన కురుస్తోంది. వానకు చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు నిండి పొంగి పొర్లుతుండగా, పొలాలు నీరుసిచ్చుపట్టి దెబ్బతింటున్నాయి. సోమవారం మహబూబ్‌నగర్‌ జిల్లా యన్మన్‌గండ్ల పెద్ద చెరువు తెగింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా జిల్లా తాడూరు మండలంలో దుందుభీ నదికి ప్రవాహం పెరిగింది. అమ్రాబాద్‌ మండలం మన్ననూరులో భారీ వర్షంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు.


మహబూబ్‌నగర్‌/జడ్చర్ల/రాజాపూర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దాంతో జిల్లాలోని అన్ని చెరువులు జలకళను సంతరించుకున్నాయి. వర్షం తీవ్రతకు నవాబ్‌పేట మండలం యన్మన్‌గండ్ల చెరువుకు గండిపడటంతో నీరంతా దిగువన ఉన్న ఇప్పటూర్‌ గ్రామాన్ని ముంచెత్తింది. రైతు జంగయ్యకు చెందిన రెండు గేదెలు వరదలో కొట్టుకుపోయాయి. ఇద్దరు వ్యక్తులు వరదలో చిక్కుకోగా వరద తగ్గడంతో ప్రమాదం తప్పింది. వరదతో 270 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. తెగిన చెరువును ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు పరిశీలించారు. జిల్లాలోని దుంధుభీ, పెద్దమ్మ వాగులు పొంగిపొర్లుతున్నాయి. కోయిల్‌సాగర్‌ నీటిమట్టం 29.5 అడుగులకు చేరింది. ఫర్దీపూర్‌ రిజర్వాయర్‌ నిండుకుండలా మారింది. సీసీకుంట మండలం బండ్రవల్లి చెక్‌డ్యామ్‌ అలుగుపారడం చూపరులను ఆకర్శిస్తోంది. హన్వాడ మండలం ఇబ్రహీంబాద్‌లోని బేరోని కుంట అలుగుపారింది. సీసీకుంట మండలం ఏదులపురం చెక్‌డ్యామ్‌, జడ్చర్ల మండలం లింగంపేట, అల్వాల్‌పల్లి, గుట్టికాడిపల్లి, బాలానగర్‌ మండలం పెద్దపల్లి, రాజాపూర్‌ మండలం కుచ్చర్కల్‌, రాజాపూర్‌, ముదిరెడ్డిపల్లి, నందిగామ, మల్లేపల్లి గ్రామాల్లోని చెక్‌డ్యామ్‌లు అలుగులు పారు తున్నాయి. దాంతో చెక్‌డ్యామ్‌లు, చెరువులను చూసేందుకు జనం బారు లు కడుతున్నారు. వర్షాలకు నీరుసిచ్చు పట్టి పంటలు దెబ్బతిం టున్నాయని రైతులు వాపోతున్నారు. కలుపు బాగా పెరిగిన చోట పంటలను వదిలేస్తున్నారు. ముందుగా ఆరుతడి పంటలు వేసిన రైతులకు మాత్రం ఇబ్బంది లేదు. జడ్చర్ల మునిసిపాలిటీలోని బురెడ్డిపల్లి శివారులో విష్ణు, వెంకటయ్య, రాము, ఆంజనేయులు వరి పంట నీట మునిగింది. కుర్వపల్లి శివారులో గల ఈద్గాన్‌పల్లి చెరువు సమీపంలో సుమారు 15 ఎకరాల్లో వేసిన వరి పంట నీట మునిగింది. 


42.6 మిల్లీ మీటర్ల వర్షం

జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు సగటున 42.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. రాజపూర్‌లో 85.5 మిల్లీ మీటర్లు, నవాబ్‌పేటలో 80, గండీడ్‌లో 73.6, మహ్మదాబాద్‌లో 69.8, బాలనగర్‌లో 61.1, జడ్చర్లలో 46.9, భూత్పూర్‌లో 41.2, హన్వాడలో 33.5, మిడ్జిల్‌లో 30.9, మహబూబ్‌నగర్‌ అర్బన్‌లో 33.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

విస్తారంగా వర్షాలు

నారాయణపేట: నారాయణపేట జిల్లా వ్యాప్తంగా సోమవారం విస్తారంగా వర్షం కురిసింది. లోతట్టు ప్రాం తాల్లో, చేలల్లో నీరు నిలిచింది. నీటికి పత్తి, కంది పంటలు ఎర్రబారి దెబ్బతింటున్నాయని రైతులు వాపో తున్నారు. కృష్ణా మండలం కున్షి, నేరేడ్‌ గోం, హిందూపూర్‌ గ్రామాల్లో, మాగనూర్‌ మండలంలోని లోతట్టు ప్రాంతాల్లో, నారాయణపేట మండలం అప్పిరెడ్డి పల్లి, సింగారం గ్రామాల్లో పత్తి పంట దెబ్బతింది. సింగారం వాగు ఉధృత్తికి ఇసుక మేటలు ఏర్పడి వరి పంట దెబ్బతింది. నారాయణపేట కొండారెడ్డి పల్లి చెరువు, పేరపళ్ల జాయమ్మ చెరువు అలుగు పారుతున్నాయి. పలు వాగులు పొంగి పొర్లు తున్నాయి. 

వర్షపాతం ఇలా..

కోస్గిలో అత్యధికంగా 48.6 మిల్లీ మీటర్లు, మక్తల్‌లో అత్యల్పంగా 7 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. నారాయణపేటలో 39.2 మిల్లీ మీటర్లు, దామరగిద్దలో 21.4, ధన్వాడలో 13, మరికల్‌, ఊట్కూర్‌లలో 12.8, నర్వలో 21.8, మాగనూర్‌లో 15.4, కృష్ణాలో 13.5, మద్దూర్‌లో 30 మిల్లీ మీటర్ల వర్షం పడింది.


విస్తారంగా వర్షాలు

నారాయణపేట: నారాయణపేట జిల్లా వ్యాప్తంగా సోమవారం విస్తారంగా వర్షం కురిసింది. లోతట్టు ప్రాం తాల్లో, చేలల్లో నీరు నిలిచింది. నీటికి పత్తి, కంది పంటలు ఎర్రబారి దెబ్బతింటున్నాయని రైతులు వాపో తున్నారు. కృష్ణా మండలం కున్షి, నేరేడ్‌ గోం, హిందూపూర్‌ గ్రామాల్లో, మాగనూర్‌ మండలంలోని లోతట్టు ప్రాంతాల్లో, నారాయణపేట మండలం అప్పిరెడ్డి పల్లి, సింగారం గ్రామాల్లో పత్తి పంట దెబ్బతింది. సింగారం వాగు ఉధృత్తికి ఇసుక మేటలు ఏర్పడి వరి పంట దెబ్బతింది. నారాయణపేట కొండారెడ్డి పల్లి చెరువు, పేరపళ్ల జాయమ్మ చెరువు అలుగు పారుతున్నాయి. పలు వాగులు పొంగి పొర్లు తున్నాయి. 

వర్షపాతం ఇలా..

కోస్గిలో అత్యధికంగా 48.6 మిల్లీ మీటర్లు, మక్తల్‌లో అత్యల్పంగా 7 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. నారాయణపేటలో 39.2 మిల్లీ మీటర్లు, దామరగిద్దలో 21.4, ధన్వాడలో 13, మరికల్‌, ఊట్కూర్‌లలో 12.8, నర్వలో 21.8, మాగనూర్‌లో 15.4, కృష్ణాలో 13.5, మద్దూర్‌లో 30 మిల్లీ మీటర్ల వర్షం పడింది.


బీడువారుతున్న పత్తి

తాడూరు: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు మండలంలో పంటలు బీడుగా మారుతున్నాయి. నీరు నిలిచి మొక్కలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రోజంతా కురిసిన వర్షానికి దుందుభీ నదిలో ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. దాంతో సిర్సవాడ-కల్వకుర్తి మధ్యలో పోలీసులు రాకపోకలు నిలిపేశారు. నదిలోకి ఎవరూ వెళ్లకుండా ముళ్ల కంప వేసి, కట్టెలను అడ్డుగా పెట్టినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు చెప్పారు. ఇటు వాన, అటు దుందుభీ, ఇంకోవైపు కేఎల్‌ఐ నీటితో పంటలు నీట మునుగుతు న్నాయని రైతులు చెబుతున్నారు.


స్తంభించిన జన జీవనం

మన్ననూర్‌: మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలో జన జీవసం స్తంభించింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపిలేని భారీగా వర్షం కారణంగా జనం ఇళ్లలోంచి బయటికి రాలేదు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ ప్రహరీ కూలిపోయింది. గ్రామంలోని పలు వీధుల నుంచి వర్షపు నీరు రావడం వల్లే కూలిపోయినట్లు అధికారులు తెలిపారు.


కూలీల కొరతతో రైతుల ఇక్కట్లు

వర్షాలతో ముమ్మరంగా నాట్లు  

నారాయణపేట: వర్షాలు కురుస్తుండటంతో వరి నాట్లు జోరందుకున్నాయి. దాంతో నారాయణపేట జిల్లాలో కూ లీల కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో వైపు కూలీ రేట్లు పెరగడం ఆర్థిక భారంగా మారింది. ఎకరా పొలం వరి నాటడానికి గతంలో రూ.4,000 రేటు ఉండగా, ప్రస్తుతం రూ.6,000 లకు పెంచారు. గుత్తకు తీసుకొని నాటుతు న్నారు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల నాట్లే స్తున్నా దాంతో ఒక్కొక్క రికి రూ.600 డబ్బులు పడుతున్నాయి. ఒకవైపు వరినాట్లు మరోవైపు పత్తి, కంది పంట పొలాల్లో కలుపు తీత పనులు ఉండడంతో కూ లీలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. కూలీ ఒక్కొక్కరికి రూ.400 ఉంది. అయితే కూలీకి వచ్చే వారు ఉదయం 11 గంటలకు వచ్చి సాయంత్రం ఐదు గంటలకు వెళ్తుండటంతో పని సరిగా కావడం లేదని రైతులు అంటున్నారు. అదే గుత్తకు అయితే తొమ్మిది గంటలకే వస్తున్నారని చెబుతున్నారు చేసేది లేక రైతులు దూర ప్రాంతాల నుంచి కూలీలను గుత్తకు రప్పించి నాట్లు వేయించుకుంటున్నారు. 


వనపర్తిలో మోస్తరు వర్షం 

వనపర్తి అర్బన్‌: వనపర్తి జిల్లా వ్యాప్తంగా మంగళవారం మోస్తరు వర్షం కురిసింది. పాన్‌గల్‌ మండలంలో అత్యధికంగా 32.4 మిల్లీ మీటర్ల వర్షం కురవగా, అమరచింతలో అత్యల్పంగా 7.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.























Updated Date - 2022-08-09T05:25:41+05:30 IST