హైదరాబాద్‎లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

ABN , First Publish Date - 2022-07-06T12:32:34+05:30 IST

నగరంలో పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి మోస్తరు వర్షం కురిసింది ఐటీ కారిడార్‌ నుంచి కాప్రా, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, అమీర్ పేట్, ఎస్సార్ నగర్,

హైదరాబాద్‎లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

రోడ్లు జలమయం.. వాహనదారుల ఇబ్బందులు

హైదరాబాద్‌ సిటీ: నగరంలో పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి మోస్తరు వర్షం కురిసింది ఐటీ కారిడార్‌ నుంచి కాప్రా, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, అమీర్ పేట్, ఎస్సార్ నగర్, యూసఫ్‎గూడ, జూబ్లీ చెక్‎పోస్ట్, క్రిష్ణానగర్, ఎల్వీనగర్, మల్కాజిగిరి, ఉప్పల్‌, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు, రోడ్ల పక్కన తోపుడు బండ్ల వ్యాపారులు ఇళ్లకు వెళ్లే క్రమంలో ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి. 65వ నెంబర్‌ జాతీయ రహదారి మియాపూర్‌ నుంచి పంజాగుట్ట, ఖైరతాబాద్‌, మలక్‌పేట, ఎల్‌బీనగర్‌ వరకు వర్షం వల్ల వాహనాలు నెమ్మదిగా కదిలాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Updated Date - 2022-07-06T12:32:34+05:30 IST