భారీ వర్షం

ABN , First Publish Date - 2022-06-24T05:22:03+05:30 IST

జిల్లా వ్యాప్తంగా గురువారం వర్షం పడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ తీక్షణమైన ఎండ కాచింది. దీనికి ఉక్కపోత తోడైంది. కానీ మధ్యాహ్నం 12 గంటల తరువాత ఒక్కసారిగా మేఘావృతమై వర్షం ప్రారంభమైంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. అక్కడక్కడా పిడుగులు పడ్డాయి. ఉరుముల శబ్దానికి ప్రజలు ఉలిక్కి పడ్డారు. అత్యధికంగా ఆమదాలవలస మండలం చింతాడలో 89.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పొందూరు, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, పలాస, టెక్కలి, సోంపేట, కవిటి, నందిగాం ప్రాంతాల్లో మోస్తరుగా వర్షం కురిసింది. శ్రీకాకుళం నగరంతో పాటు ప్రధాన పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీకాకుళం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లోకి భారీగా వరద నీరు చొచ్చుకొచ్చింది. దీంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. మురుగు కాలువలు పొంగి ప్రవహించాయి. రహదారులపై మురుగు నీరు రావడంతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. జిల్లావ్యాప్తంగా గంటల తరబడి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కాగా వర్షంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరి ఆకుమడులు సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఎదలు చల్లుకునేందుకు అదును దొరుకుతుందని చెబుతున్నారు.

భారీ వర్షం
శ్రీకాకుళంలో వర్షం పడుతున్న దృశ్యం

జిల్లావ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వాన

అత్యధికంగా చింతాడలో 89.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి) 

జిల్లా వ్యాప్తంగా గురువారం వర్షం పడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ తీక్షణమైన ఎండ కాచింది. దీనికి ఉక్కపోత తోడైంది. కానీ మధ్యాహ్నం 12 గంటల తరువాత ఒక్కసారిగా మేఘావృతమై వర్షం ప్రారంభమైంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. అక్కడక్కడా పిడుగులు పడ్డాయి. ఉరుముల శబ్దానికి ప్రజలు ఉలిక్కి పడ్డారు. అత్యధికంగా ఆమదాలవలస మండలం చింతాడలో 89.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పొందూరు, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, పలాస, టెక్కలి, సోంపేట, కవిటి, నందిగాం ప్రాంతాల్లో మోస్తరుగా వర్షం కురిసింది. శ్రీకాకుళం నగరంతో పాటు ప్రధాన పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీకాకుళం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లోకి భారీగా వరద నీరు చొచ్చుకొచ్చింది. దీంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. మురుగు కాలువలు పొంగి ప్రవహించాయి. రహదారులపై మురుగు నీరు రావడంతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. జిల్లావ్యాప్తంగా గంటల తరబడి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కాగా వర్షంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరి ఆకుమడులు సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఎదలు చల్లుకునేందుకు అదును దొరుకుతుందని చెబుతున్నారు. 

Updated Date - 2022-06-24T05:22:03+05:30 IST