భారీ వర్షం - లోతట్టు జలమయం

ABN , First Publish Date - 2022-10-07T05:07:46+05:30 IST

ప్రొద్దుటూరులో గురువారం తెల్లవారు జామునుంచి భారీ వర్షం కు రిసింది. బుధవారం సాయంత్రం నుంచి రాత్రంతా దసర సంబరాల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి తొట్టి మెరవణి చివరన తెల్లవా రు జామునుంచి భారీ వర్షం కురిసింది. పట్టణంలో వర్షం నీళ్ళు రోడ్లపై తటాకాలను తలపించాయి.

భారీ వర్షం - లోతట్టు జలమయం
కల్లుట్ల పొలాల్లో పత్తిపై నిలిచిన నీరు

నీట మునిగిన పంట పొలాలు 

ఎస్సీ కాలనీని చుట్టుముట్టిన వర్షపునీరు 

పెన్నా నదికి కొనసాగుతున్న నీటి విడుదల

ప్రొద్దుటూరు అర్బన్‌,అక్టోబరు 6: ప్రొద్దుటూరులో గురువారం తెల్లవారు జామునుంచి భారీ వర్షం కు రిసింది. బుధవారం సాయంత్రం నుంచి రాత్రంతా దసర సంబరాల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి తొట్టి మెరవణి చివరన తెల్లవా రు జామునుంచి భారీ వర్షం కురిసింది. పట్టణంలో వర్షం నీళ్ళు రోడ్లపై తటాకాలను తలపించాయి. కొర్రపాడు రోడ్డులోని తాత్కాలిక కూరగాయల మా ర్కెట్‌ ఏరియాలో పెద్ద ఎత్తున రోడ్లపై నీరు చేరి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. పొట్టిపాడు రోడ్డులోని యానాది కాలనీలో వరద నీరు వీధుల్లో మోకాళ్ల లోతు ప్రవహించాయి. లోతట్టు ఇళ్ళలోకి నీళ్ళు చేరాయి. పట్టణంలోని ప్రధాన కాల్వల్లో నీళ్ల ప్రవాహానికి ఆటంకాలు లేకుండా కమిషనర్‌ రమణయ్య పర్యవేక్షించారు. శానీటరీ వర్కర్స్‌ యుద్దప్రాతిపదికన వర్షంలోను పనులు చేశారు.

జమ్మలమడుగులో....

జమ్మలమడుగు రూరల్‌, అక్టోబరు 6: బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో జమ్మలమడుగు తదితర గ్రామా ల్లో సాగు చేసిన పంట పొలాల్లో వర్షంనీరు చేరిం ది. ఎస్‌.ఉప్పలపాడు, మోరగుడి బైపా్‌సరోడ్డు, పెద్దపసుపులరోడ్డు, ప్రొద్దుటూరు రోడ్డులోని చలివెందుల, దేవగుడి, తదితర గ్రామాల్లో సాగు చేసిన పంటల్లో వర్షపునీరు చేరింది. 

మైలవరంలో....

మైలవరం, అక్టోబరు 6: కమ్మవారిపల్లి, కల్లుట్ల, బెస్తవేముల తదితర గ్రామాల్లో గురువారం ఉద యం నుంచి భారీ వర్షం కురిసింది. వర్షానికి పత్తి, మిరప, కంది, తదితర పంట పొలాల్లో నీరు నిలిచింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షం కారణం గా పంట పొలాల్లో నీరు చేరడంతో పత్తి, మిరప మొక్కలు ఎర్రగా మారి పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు వాపోతున్నారు. మండలంలో 42.6 మి.మీ వర్షపాతం నమోదైంది.

ఎర్రగుంట్లలో....

ఎర్రగుంట్ల, అక్టోబరు6: ఎర్రగుంట్లలో చిరు వర్షానికే లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. నీరు వెళ్లేందుకు మార్గాలు లేకపోవడంతో వీధుల్లోనే ఆగి తీవ్ర దుర్వాసన వస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నా రు. గత వారంలో 53మి.మీ, నెలాఖరు రోజున 60.2మి.మీ, అక్టోబరు ఒకటిన 47.8మి.మీ వర్షం కురిసింది. గురువారం ఉదయం వరకు 7.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కొన్ని వీధుల్లో నీరు ఇప్పటికీ ఇంకిపోలేదు. వారాలతరబడి నీరు ఆగి తీ వ్ర దుర్గం, భరించరాని కంపుకొడుతోందని ప్రజలు వాపోతున్నారు. వినాయకనగర్‌లోని సున్నపుబట్టీ వీధుల్లో నీరు భారీగా ఆగింది. దీంతో వీధుల్లో ప్రజలు ఇళ్లలోకి వెళ్లాలంటేనే ఇబ్బందిగా మారింది. శాంతినగర్‌లోని హచ్‌టవర్‌ మరికొన్ని వీధుల్లో నీరు ఆగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

పోరుమామిళ్లలో....

పోరుమామిళ్ల,  అక్టోబరు 6: పోరుమామిళ్లలో గు రువారం కురిసిన వర్షానికి ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. మహాత్మాగాంధీ విగ్రహం వద్ద రోడ్డుపై వర్షపు నీరు నిలిచి వ్యాపారులకు, బాటసారులకు ఇబ్బందికరంగా మారింది. పాత పోస్టాఫీసు వీధిలో రోడ్లపై వర్షపు నీరు నిల్వచేరిం ది. ఉదయం కురిసిన వర్షంతో రోడ్లపై నీరు నిలిచి మరి కొన్ని ప్రాంతాలు బురదమయమయ్యాయి. 

కాశినాయనలో....  

కాశినాయన అక్టోబరు 6: మండలంలో 18.7 మి.మీ వర్షపాతం నమోదైనట్లు ఏఎస్‌ఓ అశోక్‌ తెలిపారు. బుధవారం ఉదయం 7గం నుంచి గురువారం ఉద యం 7గం లోపు ఈవర్ష పాతం నమోదైందన్నారు. గురువారం తెల్లవారు జామున 5గం నుంచి 7గం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో వీధులన్నీ జలమయమయ్యాయి.

నీట మునిగిన పొలాలు....

దువ్వూరు, అక్టోబరు 6: మండల వ్యాప్తంగా గురువారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురవడంతో వందలాది ఎకరాలు పంట పొలాలు నీట మునిగాయి. మండలంలో సాగు చేసిన వరి, ఉల్లి, మొక్కజొన్న, మిరప, పత్తి, మినుము పంటలు వర్షం తాకిడికి పూర్తిగా దెబ్బతిన్నాయి. పలు చోట్ల వరి, మొక్కజొన్న నీట మునిగాయి. ప్రొద్దుటూరు రోడ్డు వర్షం నీటి తాకిడికి చెరువును తలపిస్తోంది. పోలీసు స్టేషన్‌ ఎదురుగా ఉన్న టీవీ షోరూంలోకి వర్షం నీరు చేరడంతో సుమారు రూ.3 లక్షలు ఆస్తినష్టం జరిగినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. దువ్వూరులో డ్రైనేజీ సరిగా లేకపోవడంతో వర్షపునీరు వెళ్లేందుకు వీలులేకుండాపోయింది. గుడిపాడు గ్రామాల్లోని పంట పొలాల్లోని వర్షపునీరు చేరి చెరువును తలపిస్తోంది. రైతన్నలు సాగుచేసిన పంట దెబ్బతినడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎస్సీ కాలనీని చుట్టుముట్టిన వర్షపునీరు

రాజుపాళెం, అక్టోబరు 6: ఎస్సీకాలనీలో వర్షపునీరు చుట్టుముట్టింది. పంట పొలాల వంక కాలనీ పక్క నే ఉండడంతో ఉధృతంగా ఈ వంక రావడంతో ఈ కాలనీవాసులను ఇబ్బందులకు గురిచేసింది. వీధుల్లో దాదాపు మూడు అడుగుల నీరు ప్రవహిస్తుండడంతో కొందరు కాలనీవాసుల ఇళ్లలోకి నీరు చేరాయి. వారి ఇబ్బందులను రెవెన్యూ సిబ్బంది పరిశీలించారు. ఈ వంక అభివృద్ధి చేస్తేకానీ కాలనీకి నీటి ముప్పు తొలగిపోతుందన్నారు.

కొనసాగుతున్న నీటి విడుదల

మైలవరం, సెప్టెంబరు 6: మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి 5,200 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు జలాశయం ఏఈఈ గౌతమ్‌రెడ్డి తెలిపారు. గండికోట జలాశయం నుంచి మైలవరానికి 5 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో ఉత్తర కాల్వకు 150 క్యూసెక్కులు, దక్షిణ కాల్వకు 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నా రు. ప్రస్తుతం మైలవరం జలాశయం లో 5.800 టీఎంసీల నీరు నిల్వ ఉంద ని ఆయన వివరించారు.










Updated Date - 2022-10-07T05:07:46+05:30 IST