వికారాబాద్‌లో భారీ వర్షం

ABN , First Publish Date - 2022-05-15T06:32:14+05:30 IST

వికారాబాద్‌లో భారీ వర్షం

వికారాబాద్‌లో భారీ వర్షం
వికారాబాద్‌లో కురుస్తున్న వర్షం


వికారాబాద్‌/ధారూరు, మే 14: వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి పదిన్నర ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులూ వీచాయి. కురిసిన భారీ వర్షం, గాలులతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పెద్దఎత్తున వర్షం పడడంతో ప్రజలు కాస్త ఇబ్బంది పడ్డారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. అదే విధంగా ధారూరుతో పాటు పరసర గ్రామాల్లోనూ సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన చిన్నపాటి వర్షం కురిసింది. రెండు రోజులుగా ఎండవేడితో సతమతమవుతున్న ప్రజలకు శనివారం కురిసిన వర్షం కాస్త ఉపశమనాన్ని కలిగించింది.

Updated Date - 2022-05-15T06:32:14+05:30 IST