Abn logo
Sep 21 2021 @ 23:23PM

నగరంలో భారీ వర్షం

పాతబస్టాండుకు వెళ్లే దారిలో నిలిచిన వర్షపు నీరు

లోతట్టు ప్రాంతాలు జలమయం

కడప(మారుతీనగర్‌), సెప్టెంబరు 21: నగరంలో మంగళవారం రాత్రి 7 గంటల నుంచి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి కాసేపు ఉక్కపోత, మరి కొద్దిసేపు నల్లని మబ్బులతో కూడిన వాతావరణం నెలకొనగా, సాయంత్రం 6-30 గంటల నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఏకబికిన వర్షం పడింది. దీంతో పాతబస్టాండు, కొత్తబస్టాండు ఎన్జీఓ కాలనీ, అప్పరా సర్కిల్‌ తదితర లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. 

జలమయమైన ఆర్టీసీ బస్టాండు