తలకొండపల్లిలో భారీవర్షం

ABN , First Publish Date - 2022-05-21T04:49:28+05:30 IST

తలకొండపల్లి మండలం దేవుని పడకల్‌ గ్రామంలో

తలకొండపల్లిలో భారీవర్షం
తలకొండపల్లి మండలంలో పంటపొలాల్లో చేరిన వరదనీరు

తలకొండపల్లి,  మే 20 : తలకొండపల్లి మండలం దేవుని పడకల్‌ గ్రామంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. అరగంటపాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. పంట పొలాలు వర్షం నీటితో నిండిపోయాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కొన్నిచోట్ల వర్షానికి  ధాన్యం తడిసిపోయింది.

మోస్తరు వర్షం : 

షాద్‌నగర్‌ / కేశంపేట, మే20: ఫరూఖ్‌నగర్‌, కేశంపేట మండల పరిధిలోని పలు గ్రామాలలో శుక్రవారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది.  దీంతో వాతావరణం చల్లబడటంతో జనాలు ఉపశమనం పొందారు.



Updated Date - 2022-05-21T04:49:28+05:30 IST