శామీర్‌పేట,తూంకుంటల్లో భారీ వర్షం

ABN , First Publish Date - 2022-07-03T05:23:16+05:30 IST

శామీర్‌పేట,తూంకుంటల్లో భారీ వర్షం

శామీర్‌పేట,తూంకుంటల్లో భారీ వర్షం


మేడ్చల్‌, జూలై2 (ఆంధ్రజ్యోతిప్రతినిధి):  శామీర్‌పేట, తూంకుంట మునిసిపాలిటీతో పాటు మేడ్చల్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గంటకుపైగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురియడంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కూకట్‌పల్లి, అల్వాల్‌, కీసర, ఘట్‌కేసర్‌, ఎంసీపల్లిలో వాన దంచికొట్టింది. మేడ్చల్‌ మండలంలో 6.2మి.మీ, దుండిగల్‌లో 18.7మి.మీ, బాచ్‌పల్లిలో 44.0మి.మీ, కుత్బుల్లాపూర్‌లో 24.3మి.మీ, కూకట్‌పల్లిలో 21.7మి.మీ, అల్వాల్‌లో 22.6మి.మీ, బాలానగర్‌లో 22.7మి.మీ, మాల్కాజ్‌గిరి 21.3 మి,మీ, ఉప్పల్‌ 18.8 మి.మీ,  మేడిపల్లిలో 14.0మి.మీ, కాప్రాలో19.6మి.మీ, శామీర్‌పేటలో 6.5మి.మీ, కీసరలో 5.2మి.మీ,ఘట్‌కేసర్‌లో 11.8మి.మీ, ఎంసీపల్లిలో 7.8మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Updated Date - 2022-07-03T05:23:16+05:30 IST