కోనలో కురుస్తున్న వర్షం
రాపూరు, జనవరి 16: పెంచలకోన క్షేత్రంలో ఆదివారం మధ్యాహ్నం సుమారు గంటసేపు కుండపోత వర్షం కురిసింది. దీంతో కోన జలపాతం నురగలు కక్కుతూ కనువిందు చేసింది.దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు జలపాతం వద్దకు చేరుకున్నారు. కండలేరు డ్యాంకు 500 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు డ్యాం ఇంజనీర్లు ప్రకటించారు.