పాడేరులో భారీ వర్షం

ABN , First Publish Date - 2022-04-18T03:06:26+05:30 IST

అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఆదివారం భారీ వర్షం కురిసింది. సుమారు గంటన్నర సేపు ఎడతెరిపి లేకుండా వాన పడింది.

పాడేరులో భారీ వర్షం

పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఆదివారం భారీ వర్షం కురిసింది. సుమారు గంటన్నర సేపు ఎడతెరిపి లేకుండా వాన పడింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఏజెన్సీలోని వాతావరణం గత నాలుగు రోజులుగా మారిపోయింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాయడం, మూడు గంటల తరువాత ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురవడం సాధారణమైపోయింది. ఆదివారం కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. గెడ్డలు, వాగులు పొంగి ప్రవహించాయి. కాగా హుకుంపేట మండలంలో ఆదివారం మధ్యాహ్నం వడగళ్ల వాన కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాధారణంగానే ఎండకాయగా, ఆ తరువాత మూడు గంటల వరకు వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. సీలేరులో ఆదివారం సాయంత్రం ఒక మోస్తరు వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది.

Updated Date - 2022-04-18T03:06:26+05:30 IST