Abn logo
Sep 26 2021 @ 23:57PM

ఒంగోలులో జోరు వాన

కాలువలా మారిన మస్తాన్‌దర్గా సెంటరు రోడ్డు

చెరువులను తలపించిన రోడ్లు 

పొంగిపొర్లిన మురుగు కాలువలు


ఒంగోలు(కార్పొరేషన్‌), సెప్టెంబరు 26 : ఒంగో లులో ఆదివారం కురిసిన ఏకధాటి వర్షానికి నగ రం తడిసి ముద్దయింది. ఉదయం సుమారు గం టసేపు కురిసిన జోరువానకు ప్రధాన రహదారుల న్నీ చెరువులను తలపించాయి. మరోవైపు సైడు కాలువల్లో మురుగునీరు రోడ్లపైకి చేరి ఏరులైపా రాయి. నగరంలోని ప్రధాన రహదారులైన ట్రంక్‌ రోడ్‌, కర్నూలు రోడ్‌, కొత్తపట్నం బస్టాండ్‌ సెంట ర్‌, దారావారితోట, నెల్లూరు బస్టాండ్‌, బాపూజీ మార్కెట్‌, భాగ్యనగర్‌, మార్కెట్‌సెంటర్‌తో పాటు పలు ప్రాంతాల్లోని రోడ్లన్నీ చెరువులుగా మారా యి. అదేవిధంగా పలు శివారుకాలనీల్లో రోడ్లు లే కపోవడంతో ఆయా కాలనీల్లో పరిస్థితి అధ్వానం గా మారింది. కాగా నగరంలోని మంగమూరురోడ్‌, శివాజీనగర్‌ 2వ లైనులో వర్షం వస్తే బయటకు రాలేని పరిస్థితి నెలకొందని ఆయా కాలనీవాసులు వాపోతున్నారు. కొద్దిపాటి వర్షం కురిసినా రోడ్లపై నీరు చేరి, కనీసం నడవడానికి కూడా వీలు లేకుం డా పోతుందని వాపోతున్నారు. కార్పొరేషన్‌ అధికా రులు ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరిం చాలని కోరుతున్నారు.