Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 22 2021 @ 10:24AM

ముంబైలో ఎడతెగని వర్షం.. నిలిచిపోయిన లోకల్ రైళ్లు, రెడ్ అలెర్ట్ జారీ!

ముంబై: మహారాష్ట్రలోని ముంబైతోపాటు పలు ప్రాంతాల్లో ఎడతెగని వర్షం కురుస్తోంది. వాతావరణశాఖ... ముంబైలో బారీ వర్షాలను పడనున్నాయనే సూచన చేస్తూ, రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ముంబైలో భారీ వర్షాల కారణంగా ఉంబెర్బాలీ-కసారా మధ్య ముంబై లోకల్ రైలు సేవలు నిలిచిపోయాయి. పట్టాలు నీట మునిగిన కారణంగా తాత్కాలికంగా రైలు సేవలను నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అలాగే వర్షాల కారణంగా కొన్ని రైళ్ల రాకపోకల సమయాలను మార్చారు. బీఎంసీ అధికారులు తెలిపిన వివరాల  ప్రకారం ముంబైలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య సమయంలో 68.72 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.

Advertisement
Advertisement