ఆసిఫాబాద్‌లోని పలు మండలాల్లో భారీ వర్షం

ABN , First Publish Date - 2022-08-07T05:09:50+05:30 IST

పెంచికలపేటలో శనివారం భారీవర్షం కురిసింది. ఉచ్చమల్లవాగు ఉప్పొంగి ప్రవహించింది. ఎర్రగుంట గ్రామానికిచెందిన రైతుకూలీలు కూలిపనుల నిమిత్తం బొంబాయిగూడ గ్రామానికి వెళ్లగా గ్రామానికి వచ్చే సమయంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కొంతసేపు అక్కడేవేచి ఉన్నారు.

ఆసిఫాబాద్‌లోని పలు మండలాల్లో భారీ వర్షం
పెంచికలపేటలో ఉచ్చమల్లవాగు దాటుతున్న కూలీలు

పెంచికలపేట/చింతలమానేపల్లి/బెజ్జూరు, ఆగస్టు 6: పెంచికలపేటలో శనివారం భారీవర్షం కురిసింది. ఉచ్చమల్లవాగు ఉప్పొంగి ప్రవహించింది. ఎర్రగుంట గ్రామానికిచెందిన రైతుకూలీలు కూలిపనుల నిమిత్తం బొంబాయిగూడ గ్రామానికి వెళ్లగా గ్రామానికి వచ్చే సమయంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కొంతసేపు అక్కడేవేచి ఉన్నారు. ఆతరువాత గ్రామ స్థుల సహాయంతో వాగుదాటారు. చింతలమానేపల్లి మండ లంలో కేతిని-దిందా మధ్యలో ఉన్న వాగు ఉప్పొంగి ప్రవ హించడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. బెజ్జూరు మండలంలో కుశ్నపల్లి, సోమిని గ్రామాలమధ్య వాగులు ఉప్పొంగ డంతో రాకపోకలు నిలిచిపోయాయి. వర్షానికి మండల కేంద్రంలోని పలువురి ఇళ్లలోకి వరద నీరు చేరింది. కొన్ని రోజుగా వర్షం లేకపోవడంతో వరిసాగు కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వర్షం ఊరట నిచ్చింది.

Updated Date - 2022-08-07T05:09:50+05:30 IST