మదనపల్లెలో భారీ వర్షం

ABN , First Publish Date - 2022-05-17T05:16:23+05:30 IST

మదనపల్లె పట్టణంలో సోమవారం సాయంత్రం గంటపాటు పెద్దశబ్దంతో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.

మదనపల్లెలో భారీ వర్షం
మొబైల్స్‌ దుకాణంలోకి చేరిన వర్షపు నీరు

వర్షపు నీటిలో మునిగిన మొబైల్స్‌ దుకాణం

రోడ్లపై ప్రవహించిన మురుగునీరు


మదనపల్లె టౌన్‌, మే 16: మదనపల్లె పట్టణంలో సోమవారం సాయంత్రం గంటపాటు పెద్దశబ్దంతో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో పలు వీధుల్లో మురుగు కాలువలు పొంగిపొర్లాయి. అంబేడ్కర్‌ సర్కిల్‌, బుగ్గకాలువ వద్ద మోకాటిలోతు వర్షపునీరు నిలిచిపోవడంతో ద్విచక్రవాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గాంధీరోడ్డు, బెంగళూరు రోడ్డు, కదిరి రోడ్డులో వర్షపునీరు ప్రవహించి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కాగా ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి బీసెంట్‌ వీధిలో ఇటీవల మున్సిపల్‌ అధికారులు మురుగుకాలువ నిర్మాణానికి 200 మీటర్ల పొడవునా గోతులు తవ్వారు. వర్షపు నీరంతా ఈ గోతుల్లో ప్రవహించడంతో ఇదే వీధిలోని లోతట్టులో ఉన్న దివా మొబైల్స్‌, కంప్యూటర్‌ స్పేర్‌ పార్ట్స్‌ దుకాణంలోకి ఈ గోతుల్లో ప్రవహించిన నీరంతా చేరిపోయింది. దీంతో సుమారు రూ.10 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇండస్ర్టియల్‌ ఎస్టేట్‌, ఆర్టీసీ బస్టాండు ప్రాంతాల్లో విద్యుత్‌ తీగలపై చెట్ల కొమ్మలు పడటంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో పట్టణమంతా చిమ్మచీకట్లో ఉంది. 

Updated Date - 2022-05-17T05:16:23+05:30 IST