Abn logo
Sep 27 2021 @ 17:23PM

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గత రెండు గంటలుగా హైదరాబాద్‌లో కుండపోత వర్షం పడుతోంది. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ హైఅలర్ట్‌ ప్రకటించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కారు మబ్బులు కమ్ముకున్నాయి. మరో నాలుగైదు గంటలపాటు హైదరాబాద్‌లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని పోలీసుల సూచిస్తున్నారు. బయట ఉన్నవారు వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరించారు. ఎక్కడికక్కడ యంత్రాంగాన్ని ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. 



బంగాళాఖాతంలో ఏర్పడిన ‘గులాబ్’ తుఫాన్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం హైఅలర్ట్ అయింది. నేడు, రేపు జీహెచ్ఎంసీ హైఅలర్ట్ ప్రకటించింది. గులాబ్‌ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం, మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండేలా అధికారుల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. తుఫాన్ నేపథ్యంలో హైదరాబాద్‌లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు కంట్రోల్‌ రూమ్ 040-23202813 నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఇవి కూడా చదవండిImage Caption