గొలుగొండ మండలంలో కుండపోత

ABN , First Publish Date - 2021-05-06T05:33:10+05:30 IST

మండలంలో బుధవారం సాయంత్రం మెరు పులు, ఉరుములు, ఈదురు గాలులతో భారీ వర్షం కురి సింది.

గొలుగొండ మండలంలో కుండపోత
అల్లూరి పార్కు వద్ద కూలిన చింతచెట్టు


 

 రెండు గంటల పాటు ఈదురు గాలులతో వాన

 అల్లూరి పార్కు సమీపంలో చింతచెట్టు కూలి  ట్రాఫిక్‌ సమస్య 


కృష్ణాదేవిపేట/గొలుగొండ మే 5 : మండలంలో బుధవారం సాయంత్రం మెరు పులు, ఉరుములు, ఈదురు గాలులతో భారీ వర్షం కురి సింది. రెండు గంటలపాటు ఏకధాటిగా కుండపోతగా పడ డంతో ఎటుచూసినా జలమ యమైంది. గొలుగొండతో పాటు పాత కృష్ణాదేవిపేట, ఏఎల్‌పురం, నాగాపురం, కొం గింగి, జోగంపేట, చీడిగుమ్మల, ఏటిగైరంపేట తదితర గ్రామాల్లో రోడ్లపై నుంచి నీరు ప్రవహించింది.  కృష్ణాదేవిపేట- శరభన్నపాలెం రహదారి మధ్యలో అల్లూరిపార్కు సమీపాన భారీ చింతచెట్టు నేల కూలడంతో రెండు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 

 నర్సీపట్నం: పట్ణణంతో పాటు పరిసర ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ మండినప్పటికీ, నాలుగున్నర గంటల ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై వర్షం పడడంతో అంతా చల్లబడింది.  వెంకునాయుడు స్కూల్‌ రోడ్డులో కాలువల ఆక్రమణ కారణంగా మరుగు రోడ్డుకి చెరడంతో అంతా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

Updated Date - 2021-05-06T05:33:10+05:30 IST