ధర్మవరం మండలంలో భారీ వర్షం

ABN , First Publish Date - 2021-10-23T05:34:33+05:30 IST

ధర్మవరం మండలంలో గురువారం అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. తొలగించి, పొలాల్లో కుప్పలుగా వేసుకున్న వేరుశనగ కట్టె కొన్నిచోట్ల కొట్టుకుపోగా.. మరికొన్నిచో ట్ల తడిసిపోయింది. దీంతో రైతులకు నష్టం వాటిల్లింది. ధర్మవరం పట్టణంలోని లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి.

ధర్మవరం మండలంలో భారీ వర్షం

 పొంగిపొర్లిన వాగులు, వంకలు

దెబ్బతిన్న వేరుశనగ కట్టె

నీటమునిగిన పౌరసరఫరాల గోదాము

రూ.లక్షల విలువ చేసే స్టోర్‌ బియ్యం నీటిపాలు


ధర్మవరం/రూరల్‌/కనగానపల్లి, అక్టోబరు 22 : ధర్మవరం మండలంలో గురువారం అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. తొలగించి, పొలాల్లో కుప్పలుగా వేసుకున్న వేరుశనగ కట్టె కొన్నిచోట్ల కొట్టుకుపోగా.. మరికొన్నిచో ట్ల తడిసిపోయింది. దీంతో రైతులకు నష్టం వాటిల్లింది. ధర్మవరం పట్టణంలోని లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. గుట్టకిందపల్లి వద్ద ఉన్న పౌరసరఫరాల గోదాములోకి నీరు చేరడంతో అందులోని స్టోర్‌ బియ్యం నీటిపాలైంది. దీంతో రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. బియ్యం తీసుకొచ్చిన లారీలు సైతం నీట మునిగిపోయాయి. వైఎస్‌ఆర్‌ కాలనీలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


పొంగిపొర్లిన చెక్‌డ్యాంలు, చెరువులు

ధర్మవరంరూరల్‌ మండలవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురిసింది. 101.6 మి.మీ., వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ భారీ వర్షానికి పలు గ్రామాల్లో వాగులు, వంకలు ఉధృతంగా పారి, చెక్‌డ్యాంలు ఉప్పొంగాయి. గొట్లూరు చెరువు నిండి, మరువ పారుతోంది. అప్రాచెరువులోకి నీరు చేరుతోంది. చిగిచెర్ల, గరుడంపల్లి, గొట్లూరు, వసంతపురం, పోతుకుంట గ్రామాల్లో చెక్‌డ్యాంలు పొంగిపొర్లాయి. చిగిచెర్ల గ్రామ రైతులు సాగుచేసిన వేరుశనగ పంటను తొలగించి, పొలాల్లో కుప్పలుగా వేసుకున్నారు. భారీ వర్షానికి ఆ కట్టె కొట్టుకుపోయింది. పంటంతా తడిసిపోయి, నల్లగా మారిపోయింది. దీంతో పశువుల మేత కూడా దక్కకుండా తీవ్రంగా నష్టపోయినట్లు భాధిత రైతులు వాపోతున్నారు. రైతు శివారెడ్డి 10 ఎకరాల్లో సాగుచేసిన వేరుశనగ పంటంతా తొలగించగా.. భారీ వర్షానికి తడిసిపోయి, తీవ్రనష్టం వాటిల్లింది. కనీసం పశువుల మేత కూడా దక్కకుండా పోయింది. పోతుకుంట బీసీ కాలనీ, శివాలయం గుడి ఆవరణలో వర్షపునీరు పారి చేరడంతో స్థానికులతోపాటు మామిళ్లపల్లికి వెళ్లే వాహనాలు నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మోటుమర్ల కేజీబీవీకి వెళ్లే రహదారిలో వర్షపు నీరు పారతుండటంతో విద్యార్థినులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. భారీవర్షంతో పంటలన్నీ దెబ్బతినడంతోపాటు ఆయా గ్రామాల్లోని కాలనీల్లో వర్షపునీరు నిలిచిపోవడంతో స్థానికులు, రైతులు తీవ్రంగా నష్టపోయారు.


Updated Date - 2021-10-23T05:34:33+05:30 IST