జల దిగ్బంధంలో చిత్తూరు

ABN , First Publish Date - 2021-11-19T00:50:26+05:30 IST

భారీ వర్షంతో చిత్తూరు నగరం చుట్టూ వర్షపు నీరు చేరింది. వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీవా నది పొంగిపొర్లుతోంది. దొడ్డిపల్లి వద్ద ఉన్న....

జల దిగ్బంధంలో చిత్తూరు

చిత్తూరు: భారీ వర్షంతో చిత్తూరు నగరం చుట్టూ వర్షపు నీరు చేరింది. వరద నీరు వచ్చి  చేరుతుండటంతో నీవా నది పొంగిపొర్లుతోంది. దొడ్డిపల్లి వద్ద ఉన్న అండర్ బ్రిడ్జి నీటి ప్రవాహంలో స్కూల్ బస్సు చిక్కుకుంది. స్థానికులు గమనించి బస్సులో ఉన్న 30 మంది విద్యార్థులను సురక్షితంగా కాపాడారు. చిత్తూరు ఏపీఎస్ ఆర్టీసీ బస్ స్టేషన్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. మరోవైపు గంగినేని చెరువు కట్ట  ప్రమాదపు అంచుల్లో ఉంది. అటు గంగినేని చెరువులో నీటి మట్టం పెరగడంతో మిట్టూరు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. 








Updated Date - 2021-11-19T00:50:26+05:30 IST