చిత్తూరులో భారీ వర్షం

ABN , First Publish Date - 2022-09-29T05:41:00+05:30 IST

నగరంలో బుధవారం సాయంత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. డ్రైనేజీలు పొంగిపొర్లాయి.

చిత్తూరులో భారీ వర్షం

చిత్తూరు కల్చరల్‌, సెప్టెంబరు28 : నగరంలో బుధవారం సాయంత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ఎంఎ్‌సఆర్‌ జంక్షన్‌ వద్ద మురుగునీరు రోడ్డుపైకి రావడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులకు గురయ్యారు. ఈదురు గాలులతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది. కన్నన్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఎదురుగా పోలీస్‌ టాప్‌లైన్‌ జంక్షన్‌ వద్ద ట్రాన్స్‌ఫార్మర్‌పై పిడుగు పడటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది.


Updated Date - 2022-09-29T05:41:00+05:30 IST