Heavy Rain in Hyderabad: దంచి కొట్టిన వర్షం.. ఎక్కడ చూసినా జలమయం

ABN , First Publish Date - 2022-09-09T04:03:43+05:30 IST

నగరంలో వర్షం దంచికొడుతోంది. గురువారం పలుచోట్ల ఓ మోస్తరుగా పడిన వర్షం.. సాయంత్రం నగరవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం...

Heavy Rain in Hyderabad: దంచి కొట్టిన వర్షం.. ఎక్కడ చూసినా జలమయం

హైదరాబాద్ (Hyderabad): నగరంలో వర్షం దంచికొడుతోంది. గురువారం పలుచోట్ల ఓ మోస్తరుగా పడిన వర్షం.. సాయంత్రం నగరవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీగా (Rain) కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. బస్తీలు, కాలనీలో వర్షపు నీరు పారుతోంది. పలుచోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. మరికొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రోడ్లపై వర్షపు నీరు ఉండటంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నగరంలో గణేష్ నిమ్మజ్జనాలకు అంతరాయం కలుగుతోంది. కొన్ని చోట్ల  వర్షంలోనే గణేష్ విగ్రహాలకు శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సిటీ మొత్తం తడిసి ముద్దైంది. అటు జీహెచ్ ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపడుతున్నారు. కొన్ని చోట్ల రోడ్లపై వృక్షాలు పడిపోవడంతో వాటిని తొలగిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు సూచించారు. 

Updated Date - 2022-09-09T04:03:43+05:30 IST