Hyderabad: కుండపోత వాన..పొంగుతున్న డ్రైనేజీలు

ABN , First Publish Date - 2022-05-04T14:47:28+05:30 IST

నగరంలో కుండపోత వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి ఒక్కసారిగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి ...

Hyderabad: కుండపోత వాన..పొంగుతున్న డ్రైనేజీలు

హైదరాబాద్: నగరంలో కుండపోత వర్షం కురిసింది. బుధవారం తెల్లవారుజాము నుంచి ఒక్కసారిగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగుతున్నాయి. వర్ష బీభత్సానికి విద్యుత్ సరఫరా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. రంగంలోకి జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌, డీఆర్‌ఎఫ్‌ బృందాలు రోడ్లపై నిలిచిన నీటిని తొలగిస్తున్నారు. వర్షానికి చార్మినార్‌, మలక్‌పేట్‌, బహదూర్‌పురా, చాదర్‌ఘాట్‌లో హోర్డింగ్స్‌ కూలిపోయాయి. కుండపోత వర్షానికి పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, రోడ్లపై మోకాళ్ల లోతు నీరు వచ్చి చేరింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి.

Read more