Japan: భారీ వరదలతో జపాన్ అతలాకుతలం

ABN , First Publish Date - 2021-07-11T23:34:18+05:30 IST

జపాన్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాతో జపాన్ అతలాకుతలం అవుతోంది

Japan: భారీ వరదలతో జపాన్ అతలాకుతలం

టోక్యో: జపాన్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలతో జపాన్ అతలాకుతలం అవుతోంది. అటామీలో నాలుగు రోజుల క్రితం భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గల్లంతైన మరో 27 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు, గురువారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. శనివారం మరోమారు భారీ వర్షం కురిసింది. దీంతో దక్షిణ జపాన్‌లోని 1.20 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


క్యుషు దీపంలోని మూడు ప్రిఫెక్చర్లలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలంటూ స్థానిక ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది.  

Updated Date - 2021-07-11T23:34:18+05:30 IST