Abn logo
Sep 29 2020 @ 20:03PM

ఏపీకి భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

Kaakateeya

అమరావతి: ఐఎండీ వాతావరణ సూచనల ప్రకారం ఈరోజు రాత్రి , రేపు రాష్ట్రం అంతటా అన్ని జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు చెప్పింది. నదీ పరివాహక, లోతట్టు ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వరద ప్రవాహం చేరుతుంటే ముందస్తుగానే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement
Advertisement