జలమయం

ABN , First Publish Date - 2022-07-04T05:57:29+05:30 IST

జిల్లాలో పలు చోట్ల ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో పల్లపు ప్రాంతాలు, నారుమడులు నీట మునిగాయి.

జలమయం
ఆకివీడులో చెరువును తలపిస్తున్న రహదారి

జిల్లాలో పలు చోట్ల ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో పల్లపు ప్రాంతాలు, నారుమడులు నీట మునిగాయి. ఆకివీడు మండలంలో భారీ వర్షానికి విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. మొగల్తూరులో నారుమడులు మునగడంతో రామన్నపాలెం, కొత్తకాయలతిప్ప, కాళీపట్నం మాగలేరు, పేరుపాలెం, కెపిపాలెం గ్రామాల్లో రైతులు వరి సాగు చేయలేమంటున్నారు. వీరవాసరం, రాయకుదురు, మత్స్యపురి రహదారులతో పాటు వీధులలో కూడా నీరు కాలువలా ప్రవహించింది. నరసాపురం, ఉండి మండలాల్లో నారు మునిగింది. ఆచంట మండలంలో డ్రెయిన్లు పొంగిపొర్లుతున్నాయి. 

– ఆకివీడు, మొగల్తూరు, నరసాపురం





Updated Date - 2022-07-04T05:57:29+05:30 IST