పెదవేగిలో భారీవర్షం

ABN , First Publish Date - 2022-07-07T05:11:33+05:30 IST

పెదవేగిలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కురిసిన భారీవర్షం పంట పొలాలను ముంచెత్తింది.

పెదవేగిలో భారీవర్షం
అమ్మపాలెంలో చెరువులా మారిన పంట పొలాలు

చెరువులను తలపిస్తున్న పంటపొలాలు

పెదవేగి, జూలై 6 : పెదవేగిలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కురిసిన భారీవర్షం పంట పొలాలను ముంచెత్తింది. చెరువులు, కుంటలు ఏకమయ్యాయి. డ్రెయిన్లు పొంగి పొర్లాయి. వీధుల్లో మురుగునీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండలంలో పలు గ్రామాల్లో వరదనీరు పోటెత్తి, పంటపొలాలు నీటమునిగాయి. అమ్మపాలెంలో పొలాలు నీటమునిగి, పొలాలు చెరువులను తలపిస్తు న్నాయి. పెదవేగిలో వర్షపునీరు రహదారులపై చేరి వాహనచోదకులు, పాదచారులు అవస్థలు పడ్డారు. మండలంలో 47 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని పెదవేగి తహసీల్దారు నల్లమిల్లి నాగరాజు తెలిపారు.



Updated Date - 2022-07-07T05:11:33+05:30 IST