Abn logo
Sep 20 2021 @ 23:29PM

ఏజెన్సీలో భారీ వర్షం

ఉధృతంగా ప్రవహిస్తున్న పట్టెన్నపాలెం జల్లేరు వాగు

పొంగిన వాగులు..


బుట్టాయగూడెం, సెప్టెంబరు 20: ఏజెన్సీ ప్రాంతంలో సోమ వారం రాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఏజెన్సీలోని కొండవాగులు పొంగి ప్రమా దకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. విప్పలపాడు వద్ద జల్లేరు కొండవాగు, వీరన్నపాలెం వద్ద వాగులు ప్రమాదకరంగా మారాయి. వాగులు పొంగడం తో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు పొంగడంతో వాగులకు ఇరువైపుల జనాలు గంటల తరబడి నిలిచిపోయారు. వాగులు తగ్గుముఖం పట్టాకగానీ ఇళ్లకు వెళ్లలేదు.

వీరన్నపాలెం వద్ద పొంగిన కొండవాగు

జల్లేరు వాగు ఉధృతి


జంగారెడ్డిగూడెం: ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండ వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఆదివారం రాత్రి, సోమవారం ఏజెన్సీ అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు జల్లేరు వాగు ఉధృతంగా వ్రహి స్తోంది. జంగారెడ్డిగూడెం పట్టెన్నపాలెం జల్లేరు వాగు రోడ్డులపై నుంచి ప్రవహించడంతో అటుగా రాకపోకలు నిలిచిపోయాయి. ఉధృతి తగ్గేంత వరకు ఉండి రాకపోకలను సాగించారు.