Heavy Rain: కుమరం భీం జిల్లాలో భారీ వర్షం

ABN , First Publish Date - 2022-08-08T01:24:33+05:30 IST

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఆదివారం భారీవర్షం (Heavy Rain) కురిసింది. ఆసిఫాబాద్‌, బెజ్జూరు ఆసిఫాబాద్‌

Heavy Rain: కుమరం భీం జిల్లాలో భారీ వర్షం

ఆసిఫాబాద్‌: కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఆదివారం భారీవర్షం (Heavy Rain) కురిసింది. ఆసిఫాబాద్‌, బెజ్జూరు ఆసిఫాబాద్‌, బెజ్జూరు (Asifabad Bezzur) మండలాల్లో భారీవర్షం కురవగా కౌటాల, సిర్పూర్‌(టి), సిర్పూర్‌(యూ), జైనూరు, వాంకిడి, కెరమెరి, కాగజ్‌నగర్‌, పెంచికలపేట, రెబ్బెన, తిర్యాణి మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఆసిఫాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి మండలంలోని ఈదులవాడ గ్రామంలో తూమోజు ప్రసాద్‌కు చెందిన ఇల్లు కూలిపోయింది. భారీ వర్షానికి పట్టణంలోని పైకాజీనగర్‌ కాలనీ వరద నీటితో నిండిపోయింది. దీంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడ్డారు. బెజ్జూరు మండలంలో కురిసిన భారీవర్షానికి ఇళ్లలోకి వరదనీరు వచ్చి చేరింది. గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 37.8 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.  అత్యధికంగా వాంకిడిలో 92.4 మిల్లీమీటర్లు, అత్యల్పంగా కెరమెరిలో 10.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

Updated Date - 2022-08-08T01:24:33+05:30 IST