మళ్లీ వానలు

ABN , First Publish Date - 2020-09-27T10:43:54+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. మిగిలిన ప్రాంతాల్లో ముసురు కొనసాగింది. ఖమ్మం జిల్లాలో

మళ్లీ వానలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం

పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరద

ముసురుతో దెబ్బతింటున్న పత్తి పంట


ఖమ్మం/కొత్తగూడెం, సెప్టెంబరు 26: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. మిగిలిన ప్రాంతాల్లో ముసురు కొనసాగింది. ఖమ్మం జిల్లాలో సగటు వర్షపాతం 40.2మిమీ, భద్రాద్రి జిల్లాలో 44.2మిల్లీమీటర్లుగా నమోదైంది. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా కామేపల్లిలో 83.4మి.మీ, భద్రాద్రి జిల్లాలో అత్యధికంగా ములకలపల్లిలో 77.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలతో పలుచోట్ల రహదారులు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా పత్తి పైరు దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆగస్టులో కురిసిన భారీవర్షాలతోనే ఖమ్మం జిల్లాలో సుమారు 21వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. ప్రస్తుతం కురుస్తున్న భారీవర్షాలతో నష్టం మరింత పెరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ శనివారం తెల్లవారు జామున పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కిన్నెరసాని, పెదవాగు, సింగభూపాలెం ప్రాజెక్ట్‌లు పూర్తిగా నిండాయి. కిన్నెరసాని ప్రాజెక్టు నీటిమట్టం 405అడుగులకు చేరుకోవడంతో రెండు గేట్లను ఎత్తి 3వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ఇన్‌ఫ్లో 2వేల క్యూసెక్కులుగా ఉంది. 

Updated Date - 2020-09-27T10:43:54+05:30 IST