ముంచెత్తిన వాన

ABN , First Publish Date - 2020-08-03T10:01:41+05:30 IST

జిల్లాల్లోని పలు మండలాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గార, ఆమదాలవలస, శ్రీకాకుళం, పలాస, రణస్థలం..

ముంచెత్తిన వాన

 జిల్లాలో పలుచోట్ల భారీవర్షం

శ్రీకాకుళం నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం


 శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఆగస్టు 2: జిల్లాల్లోని పలు మండలాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.  గార, ఆమదాలవలస, శ్రీకాకుళం, పలాస, రణస్థలం, ఇచ్ఛాపురం మండలాల్లో కుండపోతగా పడింది.   శ్రీకాకుళం నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.


ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో భారీగా వరద నీరు చేరింది. ఈదురుగాలులకు కొన్నిచోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్‌ సర ఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.   శ్రీకాకుళంలో 40.75 మి.మీ, గారలో 33.50, లావేరులో 32.00, పలాసలో 28.75, నందిగాంలో 23.00, రణస్థలంలో 17.25, పోలాకిలో 13.00, ఎచ్చెర్లలో 12.00, పాలకొండలో 11.50, సోంపేటలో 10.75 మి.మీ వర్షపాతం నమోదైంది.

Updated Date - 2020-08-03T10:01:41+05:30 IST