భారీ వర్షం

ABN , First Publish Date - 2021-06-15T06:21:41+05:30 IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారు జాము వరకు వర్షం కు రవడంతో జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. జిల్లాలోని రుద్రంగి, ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్‌, వేములవాడ, చందుర్తి మండలాల్లో ధాన్యం తడిసి రైతులు నష్టపోయారు.

భారీ వర్షం
వేములవాడలో పారుతున్న నక్కవాగు

- కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆగమాగం

- తడిసిన ధాన్యం, రోడ్డెక్కిన రైతులు 

- జిల్లాలో 91.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

 రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. ఆదివారం రాత్రి నుంచి  సోమవారం తెల్లవారు జాము వరకు వర్షం కు రవడంతో జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది.   జిల్లాలోని రుద్రంగి, ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్‌, వేములవాడ, చందుర్తి మండలాల్లో ధాన్యం తడిసి రైతులు నష్టపోయారు. జిల్లాలో 8.3 మిల్లిమీటర్ల సాధారణ వర్షాపాతానికి 91.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. వర్షానికి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కార్మిక వాడలు, రోడ్లు జలమయమయ్యాయి.  ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో ఇల్లు కూలిపోయింది. పలు మండలాల్లో ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. జిల్లాలోని రుద్రంగిలో 122.4 మిల్లీమీటర్ల వర్షం నమోదు కాగా, చందుర్తి 119.9, వేములవాడ రూరల్‌ 65.6, బోయినపల్లి 62.7, వేములవాడ 101.4, సిరిసిల్ల 87.4, వీర్నపల్లి 109.0, ఎల్లారెడ్డిపేట 78.3, గంభీరావుపేట 62.2, ముస్తాబాద్‌ 104.4, తంగళ్లపల్లి 92.8, ఇల్లంతకుంటలో 83.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో ప్రస్తుత వర్షాకాలం సీజన్‌లో 62.5 సాధారణ వర్షానికి 182.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వర్షానికి ధాన్యం తడవడంతో చందుర్తి మండలం తిమ్మాపూర్‌ రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని పురుగుల మందు డబ్బాతో రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు. ఎల్లారెడ్డిపేట మండలం రైతులతోపాటు కాంగ్రెస్‌ నాయకులు గొల్లపల్లి వద్ద  మొలకలు వచ్చిన ధాన్యం బస్తాలతో ఆందోళన చేపట్టారు. 

Updated Date - 2021-06-15T06:21:41+05:30 IST