యాదాద్రి భువనగిరి: జిల్లా నుంచి అక్రమంగా తరలిస్తున్నభారీగా రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుండాల మండలం మసాన్పల్లిలో ఓ ఇంట్లో నిల్వఉంచిన 25 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నారు. తమకు అందిన సమాచారంతో పోలీసుల దాడి చేసి పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.