Abn logo
Sep 22 2021 @ 20:31PM

భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత

హన్మకొండ: జిల్లాలో పోలీసుల వాహనాల తనిఖీలు చేపట్టారు. అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్న నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. పరకాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద డిసిఎం వాహనంలో తరలిస్తున్న 165 క్వింటాళ్ల సుమారు 2,47,000 విలువచేసే పీడీఎస్ బియ్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి నుండి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నట్లు డీసీఎం డ్రైవర్ తెలిపాడు. డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పరకాల సీఐ మహేందర్ రెడ్డి వెల్లడించారు. 

ఇవి కూడా చదవండిImage Caption