హైదరాబాద్: నగరంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అబ్దుల్లా పూర్ మెట్ పరిధిలో మారుతి ఈకో వాహనంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. భువనగిరి ఎస్వోటీ పోలీసులు, మల్కాజిగిరి క్రైం, అబ్దుల్లా పూర్మెట్ పోలీసులు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. గంజాయిని రవాణా చేస్తున్న నల్గొండ జిల్లాకు చెందిన సైదులు, సైదిరెడ్డి అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.21.లక్షల విలువ చేసే 200 కేజీల గంజాయి, మూడు సెల్ ఫోన్స్, ఓ మారుతి ఈకో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడిన మెండే వెంకన్న, తేలు వెంకన్న, గోపాల నాగేంద్రం, దళపతి సోమర పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.