భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం

ABN , First Publish Date - 2021-04-17T05:54:34+05:30 IST

కర్ణాటక నుంచి తరలిస్తున్న మద్యాన్ని స్వాధీ నం చేసుకుని, ఐదుగురిని అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ భవ్వకిశోర్‌ తెలిపా రు.

భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం

తనకల్లు , ఏప్రిల్‌ 16 : కర్ణాటక నుంచి తరలిస్తున్న మద్యాన్ని స్వాధీ నం చేసుకుని, ఐదుగురిని అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ భవ్వకిశోర్‌ తెలిపా రు. అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని చూస్తే అరెస్టులు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రమైన తనకల్లులోని పోలీసుస్టేషనలో విలేకరుల సమావేఽ శం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని రె డ్డివారిపల్లి గ్రామానికి చెందిన తొగట సుబ్బయ్య, కుమ్మరి చక్రపాణి కర్ణాటక రాష్ట్రంలోని చేలూరుకు చెందిన ఐశ్వర్య బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో పనిచేసే శేఖర్‌రెడ్డితో పరిచయం చేసుకుని, అతని వద్ద నుంచి ఎక్కువ మొత్తంలో మద్యంను తీసుకుని చుట్టుపక్కల గ్రామాల్లో విక్రయిస్తున్నారు. శుక్రవారం 27 బాక్సులు కర్ణాటక మద్యం తీసుకుని ద్విచక్ర వాహనాల్లో వస్తుండగా వారిని అరెస్టు చేసి, ద్విచక్ర వాహనాలను సీజ్‌ చేసి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చేలూరులోని ఐశ్వర్య బార్‌అండ్‌ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న శేఖర్‌రెడ్డిపై కూడా కేసు నమోదు చేసినట్లు వివరిం చారు. కర్ణాటక రాష్ట్రం వెంకటరెడ్డిపల్లి గ్రామానికి చెందిని శ్రీనివాసులు తమ గ్రామంలో బెల్టుషాపు నడుపుతూ చుట్టుపక్కల ఉన్న ఆంధ్రప్రదేశ రాష్ట్రంలోని తనకల్లు మండలంలో ఉన్న గ్రామాలకు మద్యం సరఫరా చేస్తుండగా అతని ద్విచక్రవాహనాన్ని సీజ్‌ చేసి, అతనిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. అమడగూరు మండలం ఏటి గడ్డతండాకు చెందిన మోహనకుమార్‌ మద్యం తరలిస్తుండగా అతనిని అరెస్టు చేసి, ద్విచ క్రవాహనం సీజ్‌ చేసినట్లు తెలిపారు. తనకల్లు మండలం కొంగరాళ్ళ గ్రామానికి చెందిన డేరారాజు అనే వ్యక్తిని అక్రమ మద్యం తరలిస్తుండగా అరెస్టు చేసి, ద్విచక్రవాహనం సీజ్‌ చేసినట్లు వివ రించారు. ఈ మద్యం విలువ రూ.3 లక్షలు ఉంటుందని తెలిపారు. అక్రమ మద్యం తరలి స్తే ఎంతటివారైనా ఉపేక్షించే ప్రశ్నేలేదని, బోర్డర్‌ గ్రామాలపై మరింత దృష్టి సారించను న్నట్లు వివరించారు. కార్యక్రమంలో రూరల్‌సీఐ మధు, తనకల్లు ఎస్‌ఐ శ్రీనివాసులు, పోలీసులు పాల్గొన్నారు.



Updated Date - 2021-04-17T05:54:34+05:30 IST