తిరుమలలో జోరువాన

ABN , First Publish Date - 2022-05-17T07:56:02+05:30 IST

తిరుమలలో సోమవారం జోరు వాన కురిసింది.

తిరుమలలో జోరువాన
ఆలయం ముందు కురుస్తున్న వర్షం

ఇబ్బంది పడిన భక్తులు


తిరుమల, మే 16 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో సోమవారం జోరు వాన కురిసింది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన వర్షం రాత్రి వరకు జోరుగా కురిసింది. దాంతో ఆలయ ప్రాంతంతోపాటు మాడవీధుల్లో నీరు నిలిచింది. శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపలకు వచ్చిన కొందరు భక్తులు వర్షంలో తడిచారు. మరికొందరు మంది దగ్గర్లోని షెడ్లలో సేదతీరారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఇక్కట్లు ఎదుర్కున్నారు. గదులు లభించని భక్తులు అవస్థ పడ్డారు. మరోవైపు ఘాట్లలో ప్రయాణించే వాహనదారులు కూడా ఇబ్బందులు పడ్డారు. ద్విచక్రవాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలంటూ అలిపిరి, జీఎన్సీ టోల్‌గేట్‌లో ప్రచారం చేశారు. కాలినడకన వచ్చే యాత్రికులు వర్షంలో తడుస్తూనే వెళ్లారు. కాగా, వర్షం రెండు, మూడ్రోజులుగా కురుస్తుండటంతో ఘాట్లపై విజిలెన్స్‌, ఫారెస్ట్‌, ఇంజనీరింగ్‌ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. తరచూ కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను నిరంతరం పరిశీలిస్తున్నారు. వర్షం కారణంగా సందర్శనీయ ప్రదేశాలకు వెళ్లే భక్తుల సంఖ్య తగ్గింది. చలితీవ్రత కొండపై పెరిగింది. 





Updated Date - 2022-05-17T07:56:02+05:30 IST