Abn logo
Oct 19 2021 @ 18:13PM

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. బంగారం అక్రమ రవాణా జరుగుతుందన్న పక్కా సమాచారంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. EK 524. దుబాయ్ మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వస్తూ ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. ఎమర్జెన్సీ లైట్‌లో బంగారాన్ని అమర్చి తరలిస్తున్నఇద్దరు సభ్యులను అదుపులోకి తీసుకొని కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు.నిందితుల నుంచి ఆరు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ 2.97 కోట్లుగా అంచనవేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption