TS news: నాగార్జునసాగర్‌కు భారీ వరద

ABN , First Publish Date - 2022-08-13T13:57:49+05:30 IST

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది.

TS news: నాగార్జునసాగర్‌కు భారీ వరద

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టు (Nagarjunasagar project)కు భారీ వరద  కొనసాగుతోంది. అధికారులు ప్రాజెక్ట్ 26 క్రస్ట్ గేట్లు 10 ఫీట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్‌లో ఇన్ ఫ్లో 4,39,987 క్యూసెక్కులు మేర వచ్చి చేరుతోంది. అలాగే  ఔట్ ఫ్లో  4,11,376 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను... ప్రస్తుత నీటి మట్టం 586.50 అడుగులకు చేరింది. పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం  312.0405 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 302.9125 టీఎంసీలకు చేరింది. 

Updated Date - 2022-08-13T13:57:49+05:30 IST