Prakasam barrage నుంచి దిగువకు భారీగా వరద... అధికారుల అప్రమత్తం

ABN , First Publish Date - 2022-08-12T15:40:45+05:30 IST

ప్రకాశం బ్యారేజ్ (Prakasam barrage) నుంచి దిగువకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Prakasam barrage నుంచి దిగువకు భారీగా వరద... అధికారుల అప్రమత్తం

అమరావతి: ప్రకాశం బ్యారేజ్ (Prakasam barrage) నుంచి దిగువకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువ నుంచి  భారీగా వరద నీరు చేరుకోవటంతో దిగువ గ్రామాల ప్రజలను మైకుల ద్వారా వాలంటీర్స్, సచివాలయ సిబ్బందితో అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. అటు పులిచింతల (Pulichintala) నుంచి 3.74 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజ్  వద్ద 3.67 లక్షల క్యూసెక్కుల వరద నీటిని 70 గేట్లు ఎత్తి సముద్రంలోకి వరద నీటిని అధికారులు విడుదల చేశారు. భారీగా వరద వచ్చి చేరుతుండటంతో తాడేపల్లి తహసిల్దార్ కార్యాలయం  కార్పొరేషన్ అధికారులు ఇరిగేషన్ అధికారులు, పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యారు. 

Updated Date - 2022-08-12T15:40:45+05:30 IST