IMD Warning: బంగాళాఖాతంలో అల్పపీడనం..పలు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు,గాలులు

ABN , First Publish Date - 2022-09-09T13:44:03+05:30 IST

బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనం(low-pressure) కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు, గాలులు వీస్తాయని...

IMD Warning: బంగాళాఖాతంలో అల్పపీడనం..పలు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు,గాలులు

న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనం(low-pressure) కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు, గాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ(India Meteorological Department) (ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది.భారీవర్షాల వల్ల కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు(Bengaluru) నగరం వరదనీటిలో ఉంది. మహారాష్ట్ర(MAHARASHTRA), పశ్చిమబెంగాల్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో భారీవర్షాలు(heavy rainfall) కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని, దీని వ్లల భారీవర్షాలు కురుస్తాయని రాంచీ ఐఎండీ అధికారి అభిషేక్ ఆనంద్ చెప్పారు.


భారీ గాలులు వీచే అవకాశం

 బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల సముద్రతీర ప్రాంతాల్లో గంటకు 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.మత్స్యకారులు fishermen) చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లరాదని ఐఎండీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జార్ఖండ్ రాష్ట్రంలోనూ ఈ నెల 11వతేదీన భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు అంచనా వేశారు.మహారాష్ట్రలోని ఉల్లాస్ నగర్, నెహ్రూచౌక్ ఖేమాని, మయూర్ హోటల్, ఉల్లాస్ స్టేషన్ రోడ్డు ప్రాంతాల్లో భారీవర్షాల వల్ల వరదనీరు చేరింది. గణేశ్ విగ్రహ మండపాల్లోకి వరదనీరు చేరింది.రాయగడ, రత్నగిరి, సింధూర్గ్ జిల్లాల్లో వచ్చే మూడు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు.


వరదలతో బెంగళూరు అతలాకుతలం

కర్ణాటక(KARNATAKA) రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో బెంగళూరు నగరం అతలాకుతలమైంది. వరదనీరు నిలబడటంతో ప్రజలు పడవల్లో ప్రయాణించాల్సి వస్తోంది. మాజీ సీఎం సిద్ధరామయ్య పడవలో ఎకోస్పేస్ లేఅవుట్ కు వెళ్లి వరద బాధితులను పరామర్శించారు.ఒడిశా రాష్ట్రంలోనూ భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. పశ్చిమబెంగాల్ సముద్ర తీరప్రాంతాల్లో అతి భారీవర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు కోరారు.


Updated Date - 2022-09-09T13:44:03+05:30 IST