గోదావరి జిల్లాలో భారీగా కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-10T20:56:51+05:30 IST

గోదావరి జిల్లాలో భారీగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.

గోదావరి జిల్లాలో భారీగా కరోనా కేసులు

తాడేపల్లిగూడెం: గోదావరి జిల్లాలో భారీగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. భీమవరం, తాడేపల్లిగూడెంలో సాధారణ రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ రెండు పట్టణాల్లో ఉన్న ఏరియా ఆస్పత్రులను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో సమీపంలో ఉన్న తణుకు ఏరియా ఆస్పత్రికి రోగుల తాకిడి విపరీతంగా పెరిగింది. అందరికీ వైద్యం చేయలేక, అత్యవసర పరిస్థితిలో వైద్యం అవసరమైనవారే రావాలని వైద్యులు చెబుతున్నారు.


గతంలో కరోనా సోకిన వారికి ఏలూరు ఆశ్రమ ఆస్పత్రిలో వైద్యం అందించేవారు. ఇప్పుడు కరోనా పాజిటీవ్ వచ్చిన వారి సంఖ్య పెరగడంతో వారికి కూడా వైద్యం అందించడానికి వీలుగా తాడేపల్లిగూడెం, భీమవరం ఏరియా ఆస్పత్రులను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చారు. అత్యవసర వైద్యం కావాల్సినవారిని ఏలూరు లేదా తణుకు ఆస్పత్రులకు వెళ్లాలని అధికారులు సూచించారు.

Updated Date - 2020-07-10T20:56:51+05:30 IST