భారీగా తగ్గనున్న విమాన ప్రయాణికుల రద్దీ

ABN , First Publish Date - 2020-07-04T06:32:05+05:30 IST

కరోనా సంక్షోభం విమానయాన సేవల రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా తాజా నివేదిక పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ 41-46 శాతం వరకు తగ్గవచ్చని అంచనా వేసింది. అంతర్జాతీయ విమాన ప్రయాణికుల రద్దీ ఏకంగా 67-72 శాతం వరకు

భారీగా తగ్గనున్న విమాన ప్రయాణికుల రద్దీ

ముంబై: కరోనా సంక్షోభం విమానయాన సేవల రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా తాజా నివేదిక పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ 41-46 శాతం వరకు తగ్గవచ్చని అంచనా వేసింది. అంతర్జాతీయ విమాన ప్రయాణికుల రద్దీ ఏకంగా 67-72 శాతం వరకు క్షీణించవచ్చని ఇక్రా అంటోంది. కరోనా వ్యాప్తి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో రెండు నెలలపాటు నిలిచిపోయిన దేశీయ విమానయాన సేవలు మే 25న తిరిగి ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ విమానయాన సేవలు మాత్రం మార్చి 22 నుంచి నిలిచిపోయాయి. వీటి సేవల నిలిపివేతను జూలై 31 వరకు పొడిగిస్తున్నట్లు తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. విమాన సేవలపై ఆంక్షలను క్రమంగా సడలిస్తుండటంతో ఈ రంగ పనితీరు ఇప్పట్లో కోలుకోకపోవచ్చని ఇక్రా అంటోంది. ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో మాత్రం కాస్త మెరుగుపడవచ్చని, ముఖ్యంగా నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో 3-14 శాతం మేర వృద్ధి నమోదు కావచ్చని నివేదికలో పేర్కొంది.

Updated Date - 2020-07-04T06:32:05+05:30 IST