Abn logo
Oct 20 2020 @ 00:44AM

అయ్యో అన్నదాత

అకాల వర్షాలతో ఉమ్మడి జిల్లా రైతులపై పెనుభారం

ఎక్కువగా దెబ్బతిన్న సన్న రకాలు

నేలకొరిగిన పంటను కోసేందుకు తిప్పలు

వరి కోసే యంత్రాలకు భారీగా డిమాండ్‌

సన్నాలకు ఎ గ్రేడ్‌ ధర ఇవ్వాలంటున్న రైతులు              

రూ.500ల ప్రోత్సాహం ఇవ్వాలంటున్న రైతు సంఘాల నేతలు


నిజామాబాద్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి జిల్లా పరిధిలో వారం రోజుల పాటు కురిసిన వ ర్షాలు బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌, బాన్సువాడ, వర్ని, కోటగిరి, రుద్రూరు, ఎడపల్లి, రెంజల్‌, నవీపేట, మోపాల్‌, నిజా మాబాద్‌ రూరల్‌, డిచ్‌పల్లి, ఇందల్వాయి మండలాల్లో ని రైతులను తీవ్ర సమస్యల్లోకి నెట్టాయి. చేతికి వచ్చే సమయంలో ధాన్యం గింజలు నేల రాలడంతో పాటు పంట నేలకొరగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయా రు. వర్షాలతో పొలాలు బురదమయం కావడంతో పంటను కోసేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. నియంత్రిత సాగు విధానంలో భాగంగా వాకాకాలంలో ప్రభుత్వం లాభసాటి పంటలు వేయాల ని, వరిలో దొడ్డు రకంకు బదులు సన్నాలు సాగుచేయా లని సూచించడంతో ఉమ్మడి జిల్లాలోని బోధన్‌, నిజామా బాద్‌, బాన్సువాడ డివిజన్‌ల పరిధిలో సన్నాలు ఎక్కువగా సాగు చేశారు. పంట చేతికివచ్చే సమయంలో అల్పపీడనం కారణంగా అకాల వర్షాలు కురిసి సన్నాలు ఎక్కువగా దెబ్బ తిన్నాయి. 


ధరలు పెంచేసిన హార్వెస్టర్ల యజమానులు

ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిధిలో మూడు రోజులుగా వ ర్షాలు లేకపోవడంతో పంటను కోసేందుకు రైతులు తిప్పలు పడుతున్నారు. వర్షాల భయంతో మార్వెస్టర్లకు అధికంగా చె ల్లిస్తున్నారు. వర్షాలు మళ్లీ కురుస్తాయేమోనని అందరూ ఒకేసారి వరి కోసేందుకు ముందుకు రావడంతో హార్వెస్టర్ల యజమానులు ధరలను భారీగా పెంచారు. గతంలో గంట కు రూ.2,200ల నుంచి రూ.2,500లు తీసుకున్న హార్వెస్ట ర్ల యజమానులు ఇప్పుడు ధరలను అమాంతం పెం చారు. వర్షభయంతో రైతులు పోటీ పడుతుండడం తో గంటకు రూ.2,500 నుంచి రూ.3వేల వరకు తీసుకుంటున్నారు. గతంలో టైర్ల హార్వేస్టర్ల ద్వా రా కోసిన రైతులు.. వరి నేల కొరగడం, పొలం బురదమయం కావడంతో చైన్‌ ఉన్న వాటినే వినియోగిస్తున్నారు. గతంలో గంటలో ఎక రం పొలం కోసిన హార్వెస్టర్లు తడిసిన పొలం లో గంటన్నర వరకు సమయం తీసుకుంటు న్నాయి. వర్షానికి ముందు టైర్లు ఉన్న హార్వెస్ట ర్‌ పొలం చివర వరకు వచ్చి ధాన్యం పోసేవి. ప్రస్తుతం బురద ఉండడం, చైన్‌ బండి పెట్టడం వల్ల ప్రత్యేకంగా ట్రాక్టర్‌ పెట్టాల్సి వస్తోంది. దీంతో ప్రతీ రైతుపై ఎకరాకు రూ.2వేల వరకు అదనపు భా రం పడుతోంది. ఇప్పటికే అకాల వర్షాల వల్ల వరి దెబ్బ తినడంతో పాటు ఈ అదనపు భారం పడడం వల్ల  ఖర్చు ఎక్కువగా అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. వర్షాలు ఉన్న సమయంలో కొనుగోలు కేంద్రాలలో తడి సిన, మొలకెత్తిన ధాన్యం సైతం కొనుగోలు చేయాలని రైతు లు కోరుతున్నారు. రకరకాల కారణాలు చెప్పి కొనకపోతే తా ము మరింత నష్టపోతామని రైతులు అంటున్నారు.


కోసిన రోజే వ్యాపారులకు విక్రయం

కొంత మంది రైతులు కోసిన రోజే ధాన్యంను వ్యాపారుల కు అమ్మకాలు చేస్తున్నారు. మద్దతు ధర రాకున్నా క్వింటా లు రూ.1,450 నుంచి రూ.1,650 మధ్యన అమ్మకాలు చేస్తు న్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకు వెళ్లాలంటే ఐదారు రో జులు ఎండబెట్టాల్సి రావడంతో పాటు పది నుంచి పదిహే ను రోజుల సమయం పట్టే అవకాశం ఉండడంతో రైతులు ఎప్పటికప్పుడు అమ్మకాలు చేస్తున్నారు. వర్షాలు ఎప్పుడైనా కురిసే అవకాశం ఉండడం వల్ల కొంత మంది ధర తగ్గినా ధాన్యం అమ్మకాలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చి నా కడ్తా తప్పకపోవడంతో ఈ అమ్మకాలను చేస్తున్నారు. ప్రభుత్వం త్వరగా కొనుగోలు చేసేవిధంగా చూడాలని వా రు కోరుతున్నారు.


సన్నాల ధర పెంచని సర్కారు

రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగులో భాగంగా సన్నాల ను సాగుచేయాలని సూచించినప్పటికీ ధరలో మాత్రం మా ర్పు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం వరికి ఏ గ్రేడ్‌కు క్వింటాలుకు రూ.1,888, బీ గ్రేడుకు రూ.1,868గా నిర్ణ యించింది. ఉమ్మడి జిల్లా పరిధిలో అదే రేటుకు కొనుగోలు చేస్తున్నారు. కేంద్రం మద్దతు ధర ప్రకారం సన్న రకాలు బీ గ్రేడు కింద ఉన్నాయి. దొడ్డు రకాలు ఏ గ్రేడు కింద ఉన్నాయి. నియంత్రిత సాగులో భాగంగా సన్నాలు సాగు చే సిన రైతులు ప్రభుత్వం ఏ గ్రేడు కింద లేదా ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తుందని భావించారు. కానీ ఇప్పటి వరకు మా త్రం రాష్ట్ర ప్రభుత్వం ధరపై స్పష్టత ఇవ్వలేదు. వర్షాలకు సై తం సన్న రకాలే ఎక్కువ దెబ్బతినడం వల్ల ప్రభుత్వం తమ ను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రైతు సంఘాల నే తలు మాత్రం సన్న రకాలకు క్వింటాలు 500 రూపాయల ప్రోత్సాహం ఇవ్వాలని కోరుతున్నారు.


కొనుగోలు కేంద్రాలు త్వరగా ఏర్పాటు చేయాలి- పెద్దకాపు సాయిలు, కోటగిరి

పంట కోసి ధాన్యాన్ని ఆరబెట్టాం. ప్రభుత్వం త్వరగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి. ఇప్పటికే వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటు న్నాం. వ్యాపారులకు అమ్ముదామంటే తక్కువ ధరకు కొంటున్నారు.


హార్వెస్టర్ల యజమానులు ధర పెంచారు- కోయిగూర్‌ సాయిలు, కోటగిరి

వర్షాలతో వరి పంట నేలకొరగడం వల్ల హార్వెస్టర్లతో కోసేందుకు ఎక్కువ సమయం పడుతోంది. వర్షం లేనప్పుడు ఎకరాకు గంట సమయం పడితే ఇప్పుడు గంటన్నర పడుతోం ది. దీంతో హార్వెస్టర్ల యజమానులు ధరలు పెంచేశారు. ఫలితంగా వరి కోతలకు అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తోంది.


సన్నాలకు సర్కారు ప్రోత్సాహం ఇవ్వాలి- అన్వేష్‌రెడ్డి, కిసాన్‌ ఖేత్‌, రాష్ట్ర అధ్యక్షుడు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో నియంత్రిత సాగు విధానంలో భాగంగా ఉమ్మడి నిజామాబా ద్‌ జిల్లాలో ఎక్కువ మంది రైతులు సన్నరకం ధాన్యాన్ని సాగుచేశారు కాబట్టి ప్రభుత్వం సన్నాలకు క్వింటాలుకు రూ.500 ప్రోత్సాహం ఇవ్వాలి. దొడ్డు రకం కంటే అధికంగా ధర పెడితేనే రైతులకు గిట్టుబాటు అవుతోంది. అల్పపీడన కారణంగా ఇప్పటికే రైతులు చాలా పంటలను నష్టపోయారు. ఈ క్రమంలో సన్నరకం రకం ధాన్యాన్ని ధర పెంచి కొనుగోలు చేయకుంటే రైతులు రెండు రకాలుగా నష్టపోయే ప్రమా దం ఉంది. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి.

Advertisement
Advertisement