Abn logo
Sep 11 2021 @ 21:00PM

భారీగా బంగారం స్వాధీనం

కర్నూలు: సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. తమకు అందిన విశ్వసనీయమైన సమాచారంతో పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలను సెబ్ పోలీసులలు చేపట్టారు. ఈ తనిఖీలలో ఈ 1.77 కోట్ల విలువైన 3.73 కేజీల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెంగుళూరులోని విక్రమ్ జువెలర్ షాప్‌కు చెందిన రమేష్, సురేష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగారం రవాణాపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.