వేడెక్కిన రాజకీయం

ABN , First Publish Date - 2021-04-19T04:39:36+05:30 IST

పాలక వర్గాలు ముగిసిన పురపాలికల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది..

వేడెక్కిన రాజకీయం
జడ్చర్లలో అభ్యర్థులకు సూచనలిస్తున్న అదనపు కలెక్టర్‌

- జడ్చర్ల, అచ్చంపేటలో రసవత్తరంగా మారిన మునిసిపల్‌ ఎన్నికలు

- చివరి రోజు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు

- జడ్చర్లలో బీ-ఫారాల కోసం అభ్యర్థుల ఎదురుచూపులు

- రిజర్వేషన్లు తారుమారు కావడతో తలనొప్పులు

- ఇతర పార్టీల తీర్థం పుచ్చుకుంటున్న ఆశావహులు

- అసంతృప్తులను ఆకర్షిస్తున్న బీజేపీ నాయకులు


జడ్చర్ల, ఏప్రిల్‌ 18 : పాలక వర్గాలు ముగిసిన పురపాలికల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జడ్చర్ల, అచ్చంపేట మునిసిపాలిటీలకు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి.. ప్రధానంగా టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి టికెట్‌ ఆశిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంది.. ఆదివారం నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో రెండు మునిసిపాలిటీల్లో కలిపి మొత్తం 389 నామినేషన్లు దాఖలయ్యాయి.. అయితే, పార్టీలు ఎవరికి బీ-ఫారాలు ఇస్తుందనే విషయంలో అభ్యర్థుల్లో సందిగ్ధత నెలకొన్నది.. అనుకున్న పార్టీ నుంచి బీ-ఫారాలు రాకపోతే, మరో పార్టీ నుంచైనా బీ-ఫారాలు పొందేందుకు కొందరు నాయకులు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.. ఇప్పటికే జడ్చర్లలో కొందరు నాయకులు కండువాలు మార్చడంతో రాజకీయం రంగులు మారుతోంది..

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మునిసిపాలి టీకి తాజాగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నో టిఫికేషన్‌ విడుదల కాగా, 30న పోలింగ్‌ జరగనుంది. ఆదివారంతో నామి నేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం 27 వార్డులకు గాను 241 నామినేన్లు దాఖ లయ్యాయి. అయితే, ఆయా పార్టీల నుంచి ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధ మైన అభ్యర్థులు, వార్డుల రిజర్వేషన్‌లు తారుమారు కావడంతో కంగుతిన్నారు. దీంతో రిజర్వేషన్లకు అనుగుణంగా ఆయా వార్డుల్లో పోటీ చేసేందుకు సిద్ధమైనా, అందుకు ఆయా పార్టీల అధిష్ఠానాల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాకపోవడంతో రూటు మార్చారు. ఇన్నాళ్లు అంటిపెట్టుకుని ఉన్న పార్టీని వదిలి, మరో పార్టీలో చేరుతు న్నారు. ఇందులో భాగంగానే అధికార పార్టీకి చెందిన ఇద్దరు భార్యాభర్తలు బీ జేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్‌ల ఆధ్వర్యంలో కమలం తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌, బీజేపీలో కొన్నేళ్లుగా పార్టీకి సేవలు అందిస్తున్నా, తమకు ఎలాంటి గుర్తింపు లేదంటూ మరికొందరు ఆయా పార్టీలను వదిలి టీఆర్‌ఎస్‌లో చేరారు. అధికార పార్టీ నుంచి టికెట్‌ ఆశించిన మరికొందరు ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయి తే, టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశించి, భంగపడిన వారిని ఆకర్షించేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. 

ప్రధాన పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులలో కొందరు తమకు బీ-ఫారం వస్తుం దా? రాదా? అనే విషయంలో సందిగ్ధంలో పడ్డారు. నామినేషన్ల ఉపసంహరణ గడువులోగా బీ-ఫారం ఆర్వోకు అందిస్తేనే పార్టీ గుర్తుపై పోటీ చేసే అవకాశం ఉంటుంది. లేకుంటే స్వతంత్ర అ భ్యర్థిగా ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో అనుకున్న పార్టీ నుంచి బీ-ఫారం రాకుం టే, మరో పార్టీ నుంచి బీ-ఫారం పొందే విధంగా అన్ని రాజకీయ పార్టీల నాయ కులతో అభ్యర్థులు సత్సంబంధాలను కొనసాగిస్తుండటం కొసమెరుపు.


జడ్చర్ల మునిసిపాలిటీకి 241 నామినేషన్లు

జడ్చర్ల మునిసిపాలిటీకి శనివారం 19 నామినేషన్లు దాఖలు చేయగా, చివరి రోజు 222 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 241 నామినేషన్లు దాఖలు కా గా, అందులో టీఆర్‌ఎస్‌ నుంచి 63 మంది, బీజేపీ నుంచి 42, సీపీఐ నుంచి నా లుగు, సీపీఎం నుంచి ఒకటి, కాంగ్రెస్‌ నుంచి 43, ఎంఐఎం నుంచి 9, స్వతం త్రులు 79 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 208 మంది బరిలో నిలిచారు. ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు మునిసిపల్‌ కార్యాలయ ఆ వరణలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా, అభ్యర్థులు వారి అనుచరుల తో కేంద్రానికి ర్యాలీలతో తరలి రావడంతో, గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో అక్కడే ఉన్న అదనపు కలెక్టర్‌ తెజస్‌ నంద లాల్‌ పవర్‌ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. నామినేషన్‌ వేసేందుకు వచ్చిన అభ్యర్థులను కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన టెంటులో క్రమ పద్ధతిలో నామినేషన్‌ వేసేలా చూశా రు. అలాగే అభ్యర్థులు వెంట వచ్చిన వారి అనుచరులను బయటకు పంపించా రు. దీంతో కేంద్రం వద్ద కేవలం నామినేషన్‌ వేసే అభ్యర్థులు, ప్రపోజర్లు మా త్రమే ఉండటంతో, ఈ ప్రక్రియ సజావుగా సాగింది.


అచ్చంపేట మునిసిపాలిటీకి 148 నామినేషన్లు

అచ్చంపేట టౌన్‌ : అచ్చంపేట మునిసిపాలిటీలోని 20 వార్డులకు మొత్తం 148 మంది నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు ఆదివారం గడువు ము గిసే సమయానికి 99 నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్‌ఎస్‌ నుంచి 62, కాంగ్రెస్‌ 47, బీజేపీ 28, ఎంఐఎం 2, స్వతంత్రులు 9 నామినేషన్లు దాఖలు చేశా రు. సోమవారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 22న నామినేషన్ల ఉపసం హరణ ఉంటుంది.



Updated Date - 2021-04-19T04:39:36+05:30 IST