మోడరన్‌ కళాశాల డైరక్టర్‌ హఠాన్మరణం

ABN , First Publish Date - 2021-04-14T04:24:40+05:30 IST

ఆ కుటుంబాన్ని గుండెపోట్లు వీడేట్లు లేదు.. వరసగా ముగ్గురు గుండెపోటుతో మరణించడంతో వారి కుటుంబాలతో పాటు, లోుమిత్రుల కుటుంబాల్లో విషాద చాయలు అలుముకున్నాయి.

మోడరన్‌ కళాశాల డైరక్టర్‌ హఠాన్మరణం
రమాదేవి(ఫైల్‌)

  రమాదేవి మృతితో మధిరలో తీవ్ర విషాదం 

 గతంలో ఇద్దరూ కుమారులూ గుండెపోటుతో మృతి

మధిరటౌన్‌, ఏప్రిల్‌ 13: ఆ కుటుంబాన్ని గుండెపోట్లు వీడేట్లు లేదు.. వరసగా ముగ్గురు గుండెపోటుతో మరణించడంతో వారి కుటుంబాలతో పాటు, లోుమిత్రుల కుటుంబాల్లో విషాద చాయలు అలుముకున్నాయి. మోడరన్‌ విద్యాసంస్థల అదినేత అమరనేని అప్పారావు సతీమణి కళాశాల డైరక్టర్‌ అమరనేని రమాదేవి(55) మంగళవారం తెల్లవారు జామున వారి స్వగ్రామం గొల్లెనపాడు లో గుండెపోటు తో మరణించారు. దాదాపు రెండు దశాబ్ధాల పైగా మధిరలో ఇంటర్‌, డిగ్రీ కళాశాలలు నిర్వహిస్తున్నారు. వీరి చిన్న కుమారుడు అజయ్‌ ఇంటర్‌ పూర్తి చేసి ఎంసెట్‌ కోచింగ్‌ తీసుకుంటూ 18 ఏళ్ల వయస్సులో 2006లో గుండెపోటుతో మరణించగా, పెద్ద కుమారుడు విజయ్‌ సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూ 32ఏళ్ల వయస్సులో 2018లో గుండెపోటుతో మరణించాడు. ఇప్పుడు రమాదేవి మరణంతో వారి కుటుంబంలో మొత్తం ముగ్గురు గుండెపోట్లతో మరణించడం విషాదాన్ని నింపడమే కాకుండా మధిరలో చర్చనీయాంశం అయ్యింది. రమాదేవి మృదదేహన్ని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, టీడీపీ జిల్లా కన్వినర్‌ వాసిరెడ్డి రామనాథం, టీఆర్‌ఎస్‌ నాయకులు మల్లాది వాసు, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కిషోర్‌, సశీల విద్యాసంస్థల అధినేత కరివేద వెంకటేశ్వరరావు, వివిధ విద్యాసంస్థల నిర్వాహకులు, రాజకీయ నాయకులు సందర్శించారు. రమాదేవి మృతదేహానికి నివాళులు అర్పించారు. 

Updated Date - 2021-04-14T04:24:40+05:30 IST