ఉక్రెయిన్‌లో ధ్వంసమైన అతిపెద్ద విమానం...సోషల్ మీడియాలో చిత్రాలు

ABN , First Publish Date - 2022-03-05T16:03:54+05:30 IST

రష్యా సైనికదళాలు జరిపిన దాడుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద విమానం అయిన ఆంటోనోవ్ యాన్-225 పూర్తిగా ధ్వంసమైంది....

ఉక్రెయిన్‌లో ధ్వంసమైన అతిపెద్ద విమానం...సోషల్ మీడియాలో చిత్రాలు

కీవ్ : రష్యా సైనికదళాలు జరిపిన దాడుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద విమానం అయిన ఆంటోనోవ్ యాన్-225 పూర్తిగా ధ్వంసమైంది.ఈ ధ్వంసమైన విమానం చిత్రాలు శనివారం సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఉక్రెయిన్ దేశానికి చెందిన ఈ ఆంటోనోవ్ విమానం ధ్వంసమవడంతో దీని శకలాలు హోస్టోమెల్ విమానాశ్రయంలో కనిపించాయి.ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ధ్వంసమైన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నాయి.పెద్ద విమానం పూర్తిగా ధ్వంసమైంది.ధ్వంసమైన విమాన భాగాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. విమానం యొక్క అవశేషాల చిత్రాలు ఉక్రెయిన్‌లోని హోస్టోమెల్ విమానాశ్రయంలో చివరిగా కనిపించాయి. 


ఫ్లైట్ డేటా ప్రకారం ఈ విమానం ఫిబ్రవరి 5వతేదీన హోస్టోమెల్ విమానాశ్రయంలో దిగింది.విమానం ప్రతి రెక్కపై మూడు జెట్ ఇంజన్లు ఉన్నాయి. సాధారణ విమానం కంటే దీనికి ఎక్కువ చక్రాలు ఉన్నాయి. ఈ విమానం ధ్వంసం చేయడం వల్ల భూమి నుంచి నల్లటి పొగ లేచి తెరలు ఏర్పడ్డాయి.


Updated Date - 2022-03-05T16:03:54+05:30 IST