గూగుల్‌ ఫిట్‌తో హార్ట్‌ ట్రాకింగ్‌

ABN , First Publish Date - 2022-01-01T05:30:00+05:30 IST

‘గూగుల్‌ ఫిట్‌’తో ఇప్పుడు హార్ట్‌ ట్రాకింగ్‌ చేసుకునే సౌకర్యం

గూగుల్‌ ఫిట్‌తో హార్ట్‌ ట్రాకింగ్‌

 ‘గూగుల్‌ ఫిట్‌’తో ఇప్పుడు హార్ట్‌ ట్రాకింగ్‌ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరా, ఫ్లాష్‌ను ఉపయోగించుకుని గూగుల్‌ ఫిట్‌ ఈ ట్రాకింగ్‌ను చేస్తుంది. నిజానికి హార్ట్‌ రేటును ట్రాక్‌ చేయడానికి చాలా ఫోన్లలో డెడికేటెడ్‌ సెన్సర్లు లేవు. అయితే, ఫోన్‌ వెనకవైపు ఉండే కెమెరాపై వేలిని అదిమి ఉంచి హార్ట్‌ రేట్‌ను ట్రాక్‌ చేయవచ్చు. వేలును ఫ్లాష్‌ దగ్గర సరైన ప్రదేశంలో ఉంచే విషయంలో ఫోన్‌ గైడ్‌ చేస్తుంది. ఫ్లాష్‌ వేలి రంగులో మార్పులతో రీడింగ్స్‌ను తెలియజేస్తుంది. గూగుల్‌ ఫిట్‌ యాప్‌లో పరిశీలనలు నమోదు అవుతాయి. అయితే ఈ ట్రాకింగ్‌ వ్యాధి నిర్దారణ, క్యూర్‌, ప్రివెన్షన్‌ తదితరాల కోసం మాత్రం కాదు అని గూగుల్‌ ఫిట్‌ చెబుతోంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఫోన్‌ కెమెరాల్లో హార్ట్‌ రేట్‌ మానిటరింగ్‌ కోసం కింది విధంగా చేయాలి.

ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ స్మార్ట్‌ ఫోన్లలో గూగుల్‌ఫిట్‌ యాప్‌ని ఓపెన్‌ చేయాలి. 

మీ డివైస్‌కు ఈ ఫీచర్‌ చేరినపక్షంలో హోమ్‌పేజీపై ‘చెక్‌ యువర్‌ హార్ట్‌’ ఆప్షన్‌ను టాప్‌ చేయాలి. 

స్మార్ట్‌ఫోన్‌లోని రేర్‌ ఫేసింగ్‌ కెమెరా లెన్స్‌పై వేలి కొసను పెట్టాలి. వెల్‌-లైట్‌ ఏరియాపై ఉన్నామన్నది కన్‌ఫర్మ్‌ చేసుకోవాలి. లేదంటే ఫ్లాష్‌ లైట్‌ని టర్న్‌ఆన్‌ చేసుకోవాలి.

మెజరింగ్‌ను యాప్‌ ఆరంభించగానే, స్ర్కీన్‌పై ‘వేలికొసన పల్స్‌ను పట్టుకుంటున్నాం. చేతిని అలాగే ఉంచి కొద్దిపాటి ప్రెజర్‌ను అప్లయ్‌ చేయండి’ అని మెసేజ్‌ కనిపిస్తుంది. 

హార్ట్‌ మెజరింగ్‌ ప్రక్రియకు కనీసం 30 సెకెండ్ల సమయం తీసుకుంటుంది. అదంటూ జరిగితే న్యూ విండోలో హార్ట్‌ రేట్‌ను చూసుకోవచ్చు. 

ఆ మెజర్‌మెంట్‌ను సేవ్‌ చేసుకోవాలని అనుకుంటే, స్ర్కీన్‌పై ఉన్న ‘సేవ్‌ మెజర్‌’ బటన్‌ను టాప్‌ చేయాలి. 


Updated Date - 2022-01-01T05:30:00+05:30 IST