ప్రేమించే వారిని కోల్పోతే తట్టుకోవడం కష్టం.. నాలుగేళ్లుగా తనతో కలిసి ఉన్న మరో నెమలి ఇక లేదని తెలిసి..?

ABN , First Publish Date - 2022-01-06T22:47:54+05:30 IST

మనం ప్రేమించేవారు ఉన్నట్టుండి దూరమైతే తట్టుకుంటామా? ఆ బాధ మనుషులకే కాదు.. ప్రతి జీవికీ ఉంటుంది. అప్పటివరకూ

ప్రేమించే వారిని కోల్పోతే తట్టుకోవడం కష్టం.. నాలుగేళ్లుగా తనతో కలిసి ఉన్న మరో నెమలి ఇక లేదని తెలిసి..?

ఇంటర్‌నెట్ డెస్క్: మనం ప్రేమించేవారు ఉన్నట్టుండి దూరమైతే తట్టుకుంటామా? ఆ బాధ మనుషులకే కాదు.. ప్రతి జీవికీ ఉంటుంది. అప్పటివరకూ తనకు తోడుగా ఉన్న ఓ నెమలి హఠాత్తుగా చనిపోయింది. ఆ తర్వాత జరిగిన ఘటన ప్రతి ఒక్కరి మనసును ద్రవింపజేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకెళ్తే..


రాజస్థాన్‌లోని కుచేర ప్రాంతంలో ఉన్న ఓ పార్కులో  గత నాలుగేళ్లుగా రెండు నెమళ్లు కలిసి ఉంటున్నాయి. మనుషుల్లాగా మాట్లాడుకోలేకపోయినా.. ఆ రెండు నెమళ్లు తమ భాషలోనే హావభావాలను వ్యక్తపరుచుకునేవి. ఏ కష్టమొచ్చిన ఒకదానికొకటి తోడుగా ఉండేవి. సంతోషంగా ఉన్నపుడు ఆ జంట పార్కంతా తిరుగుతూ సందడి చేసేవి. అయితే ఈ క్రమంలోనే గురువారం ఓ నెమలి హఠాత్తుగా చనిపోయింది. అది గమనించిన అటవీశాఖ సిబ్బంది దానిని తీసుకెళ్లి బయట పూడ్చిపెట్టారు. 


చనిపోయిన నెమలిని తీసుకుని ఇద్దరు వ్యక్తులు వెళ్తుండగా.. ఇంకో నెమలి వారిని అనుసరిస్తూ వెళ్లడం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో మనం చూడవచ్చు. ఎంతో కాలంగా తనతో కలిసి ఉన్న ఆ నెమలిని వదిలి ఉండలేక.. బతికున్న నెమలి బాధతో దాని వెనకాలే వెళ్లింది. ఈ వీడియోను అటవీశాఖ అధికారి పర్వీన్ కస్వాన్ తన ట్టిట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘‘మనసు కలిచివేసే సన్నివేశం.. చనిపోయిన నెమలిని విడిచిపెట్టడానికి ఇష్టపడని భాగస్వామి’’ అని క్యాప్షన్ జత చేశారు. ఈ వీడియోను  ఇప్పటివరకు 17 లక్షల మంది వీక్షించారు. మనుషులైనా, జంతువులైనా తమతో గడిపిన వారిని మరచిపోలేరు. ఇష్టపడిన వారిని మర్చిపోవడం చాలా కష్టమని.. ఆ నెమలి పరిస్థితి కూడా అలాగే ఉంటుందని.. ఇది హార్ట్ టచింగ్ వీడియో” అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.



Updated Date - 2022-01-06T22:47:54+05:30 IST